Mahesh Babu Bollywood Movie : దీపికా పదుకొణె, హృతిక్‌ రోషన్‌ల మూవీకి నో చెప్పిన మహేశ్ బాబు.. రాజమౌళినే కారణం

Mahesh Babu refuses to work with Bollywood stars : బాలీవుడ్‌ స్టార్స్‌ దీపికా పదుకొణె, హృతిక్‌ లతో కలిసి నటించాల్సిన మూవీకి నో చెప్పిన మహేశ్ బాబు. రామాయణం ఆధారంగా మేకర్స్ ఈ మూవీని తెరకెక్కించాలనుకున్నారు. మహేశ్ నో చెప్పడానికి కారణం అదే.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2022, 12:43 AM IST
  • దీపికా పదుకొణె, హృతిక్‌ లతో కలిసి నటించాల్సిన మూవీకి నో చెప్పిన మహేశ్ బాబు
  • రామాయణం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించాలనుకున్న మేకర్స్
  • మహేశ్ నో చెప్పడానికి కారణం అదే
Mahesh Babu Bollywood Movie : దీపికా పదుకొణె, హృతిక్‌ రోషన్‌ల మూవీకి నో చెప్పిన మహేశ్ బాబు.. రాజమౌళినే కారణం

Tollywood hero superstar Mahesh Babu refuses to work with Bollywood stars : టాలీవుడ్‌ స్టార్ హీరో మహేశ్‌ బాబు ఇప్పటి వరకు బాలీవుడ్‌లో (Bollywood) నటించకపోయినా  అక్కడి ఇండస్ట్రీలో ఈ సూపర్‌‌స్టార్‌‌కు మంచి క్రేజ్‌ ఉంది. దీంతో మహేశ్‌కు బాలీవుడ్‌ నుంచి ఇప్పటికే చాలా సార్లు అవకాశాలు వచ్చాయి. అయితే మహేశ్‌ బాబు, (Mahesh Babu) బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌, (Hrithik Roshan) దీపికా పదుకొణెలతో (Deepika Padukone) ఒక మూవీని తెరకెక్కించడానికి ప్లాన్ చేశారు. 

రామాయణం (Ramayanam) ఆధారంగా దంగల్‌ ఫేమ్‌ నితీష్‌ తివారి డైరెక్షన్‌లో ఈ మూవీని రూపొందించాలనుకున్నారు. ఈ మూవీకి మధు మంతెన నిర్మాతగా వ్యవహరిస్తారని టాక్ వచ్చింది. 2022లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించాలనుకున్నారు.

ఈ సినిమాలోని రాముడి (Ramudu) పాత్రకు మహేశ్‌ బాబు, సీత (Sita) పాత్రకు దీపికా పదుకొణె, రావణుడి పాత్రకు హృతిక్‌ రోషన్‌ను ఎంపిక చేశారు. అయితే మహేశ్.. హృతిక్‌, దీపికా పదుకొణెలతో కలిసి నటించాల్సిన ఈ మూవీ నుంచి మహేశ్ తప్పుకున్నాడట.

Also Read : Simbhu - Nidhi Agarwal: స్టార్ హీరోతో నిధి అగర్వాల్‌ సహజీవనం.. ఏకంగా అతని ఇంటికే మకాం మార్చిన ఇస్మార్ట్ బ్యూటీ!!

మొదట రాముడిగా నటించేందుకు మహేశ్ (Mahesh) కూడా ఒకే చెప్పాడట. ఈ వార్త బయటకు రావడంతో అప్పట్లో తమ హీరోను త్వరలో రాముడిగా చూస్తామని మహేశ్‌ ఫ్యాన్స్ (Mahesh Fans) కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అయితే తర్వాత ఈ రామాయణం బ్యాక్ డ్రాప్‌ (Ramayanam Backdrop) మూవీలో నటించేందుకు మహేశ్ బాబు నో చెప్పారట. మహేశ్.. హృతిక్‌, దీపికా పదుకొణెలతో నటించాల్సిన మూవీకి నో చెప్పడానికి కారణం రాజమౌళి. మహేశ్ బాబు ఎస్ఎస్ రాజమౌళి మూవీకి కమిట్ కావడం వల్ల రామాయణం బ్యాక్ డ్రాప్‌ మూవీకి నో చెప్పాల్సి వచ్చిందట. ఇక మహేశ్‌ బాబు (Mahesh Babu) ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పరశురామ్ డైరెక్టర్. కీర్తి సురేష్ హీరోయిన్.

Also Read :ఫార్మూలా వన్ రేసులో దుమ్ముదులుపుతున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News