Serial Actor Chandu: త్రినయని నటుడు చందు ఆత్మహత్య.. పవిత్ర జయరాం మృతి తట్టుకోలేక బలవన్మరణం

Trinayini Actor Chandu Suicide After Pavitra Jayaram Death: త్రినయని సీరియల్‌ నటి పవిత్ర జయరాం ఆకస్మిక మరణం నుంచి కోలుకోకముందే ఆ సీరియల్‌ నటుడు చందు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 18, 2024, 12:17 AM IST
Serial Actor Chandu: త్రినయని నటుడు చందు ఆత్మహత్య.. పవిత్ర జయరాం మృతి తట్టుకోలేక బలవన్మరణం

Trinayani Acto Chandu: బుల్లితెరలో వరుస విషాద సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. త్రినయని సీరియల్‌ నటి పవిత్ర జయరాం నటి తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అది మరువకముందే ఆ సీరియల్‌ నటుడు చందూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సీరియల్‌ రంగాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సంఘటనతో సీరియల్‌ రంగంలో తీవ్ర విషాదం ఏర్పడింది. కాగా అతడి ఆత్మహత్యపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పవిత్ర జయరాం ఆకస్మిక మరణంతో తట్టుకోలేక అతడు బలవన్మరణానికి పాల్పడ్డడాని తెలుస్తోంది.

Also Read: Air India Flight: ట్రక్‌ను ఢీకొన్న ఎయిరిండియా విమానం.. ప్రాణభయంతో ఉలిక్కిపడిన ప్రయాణికులు

రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అల్కాపురి కాలనీలో చందూ నివసిస్తున్నాడు. అతడి అసలు పేరు చల్లా చంద్రకాంత్‌. పరిశ్రమలోకి అడుగుపెట్టాక చందూగా పేరు మార్చుకున్నాడు. బుల్లితెరపై చాలా సీరియల్స్‌లో నటించాడు. రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం తదితర సీరియల్స్‌తో చందూకు గుర్తింపు దక్కింది. 2015లో తాను ప్రేమించిన అమ్మాయి శిల్పతో చందూకు వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వారం కిందట మహబూబ్‌నగర్‌ జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో త్రినయని నటి పవిత్ర జయరాం తీవ్ర గాయాలపాలై మృతి చెందింది. ఆమె స్వస్థలం కర్ణాటక. ఆమె అంత్యక్రియలు స్వరాష్ట్రంలో పూర్తయ్యాయి. 

అయితే ఆమె మరణం నుంచి చందూ ముభావంగా ఉంటున్నాడు. ఆమె మరణించిన రోజు నుంచి ఎక్కడా కనిపించడం లేదు. మిత్రులకు, బంధువులకు, తోటి నటులకు కూడా చందు టచ్‌లోకి రాలేదు. ఈ క్రమంలో అనూహ్యంగా శుక్రవారం సాయంత్రం అతడు అల్కాపురి కాలనీలోని తన ప్లాట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త సీరియల్‌ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నార్సింగ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అనుమానాలెన్నో.. 
పవిత్ర జయరాం మృతి చెందిన వారం రోజులకే చందూ బలవన్మరణానికి పాల్పడడం పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇద్దరి మరణంతో పరిశ్రమలో తీవ్ర విషాదం నిండింది. అయితే వెంటవెంటనే మరణాలు సంభవించడం వెనుక చాలా అనుమానాలు వస్తున్నాయి. పవిత్ర జయరాం మరణం తట్టుకోలేక చందూ ఆత్మహత్య చేసుకున్నాడని బయట వినిపిస్తున్న మాట. కానీ అతడి మరణం వెనుక చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. పవిత్ర జయరాంతో చందూకు వివాహేతర సంబంధం ఉందనే ప్రచారం జరుగుతోంది. వారిద్దరూ సహజీవనం చేస్తున్నారని చర్చ జరుగుతోంది. పవిత్రను అమితంగా ప్రేమిస్తున్న చందూ ఆమె అకాల మరణంతో దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఆమె లేని జీవితం తనకు వద్దని భావించి ఆత్మహత్య చేసుకున్నాడని వినిపిస్తోంది. కానీ ఇవన్నీ పుకార్లేనని బంధుమిత్రులు, తోటి నటీనటులు చెబుతున్నారు. అయితే పోలీసుల విచారణలో వాస్తవ విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు విచారణ చేపడుతున్నారు. త్వరలోనే అసలు విషయాలు వెలుగులోకి రానున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News