Venkatesh 76: వెంకటేష్ 76వ చిత్రంపై క్రేజీ అప్‌డేట్.. ఆ పండగ రోజే ప్రకటన.. ?

Venkatesh 76: హీరోగా కలియుగ పాండవులు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్.. రీసెంట్‌గా విడుదలైన 'సైంధవ్' మూవీతో 75 చిత్రాలు కంప్లీట్ చేసుకున్నాడు. ఇందులో దాదాపు 75 శాతం సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. వెంకీ కెరీర్‌లో లాండ్ మార్క్ మూవీగా నిలిచిపోతుందనుకున్న సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. అందుకే రాబోయే 76వ చిత్రంపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు వెంకీ మామ. అంతేకాదు ఈ సినిమాకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ప్రముఖ రోజున ప్రకటించనున్నాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 27, 2024, 11:58 AM IST
Venkatesh 76: వెంకటేష్ 76వ చిత్రంపై క్రేజీ అప్‌డేట్.. ఆ పండగ రోజే ప్రకటన.. ?

Venkatesh 76: వెంకటేష్ తన కెరీర్‌లో తెరకెక్కిన 75వ సినిమా 'సైంధవ్' మూవీ చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది. ఈ సినిమా తర్వాత వెంకటేష్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెడుతున్నాడు. తనకు ఆల్రెడీ ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి హిట్స్ అందించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ హిల్లేరియస్ కామెడీ ఎంటర్టేనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే  అనిల్ రావిపూడి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ల్ వర్క్ కూడా పూర్తి చేసాడు. బాలయ్యతో 'భగవంత్ కేసరి' తర్వాత వెంకటేష్‌తో హిల్లేరియస్ ఎంటర్టేనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా  త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఈ మూవీని ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు కాన్సెప్ట్‌తో తెరకెక్కబోతున్నట్టు సమాచారం. దాదాపు 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' టైపులో ఈ సినిమా ఉండబోతుందట. ఇందులో ఒక హీరోయిన్‌గా త్రిష ఆల్మోస్ట్ కన్ఫామ్ అయింది. మరో కథానాయికగా ఎవరిని తీసుకుంటారా అనేది చూడాలి.  

చాలా కాలం తర్వాత వెంకటేష్ ఇద్దరు భార్యల మధ్య నలిగే భర్త పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నాడు. మన చట్టాల ప్రకారం ఒక భార్య ఉండగా.. మరో భార్యను పెళ్లి చేసుకోవడం నేరం. మొదటి భార్యతో విడాకులు తీసుకోవడం కానీ.. ఆమె ఒప్పకుంటే కానీ రెండో పెళ్లి చేసుకోవడానికి చట్టం అంగీకరించదు. మన సినిమాల్లో హీరో ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో రెండో పెళ్లి చేసుకున్నట్టు చూపిస్తుంటారు. ఇపుడు వెంకటేష్‌తో  చేయబోతున్న సినిమాలో అదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నారా.. లేదా అనేది చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన మహా శివరాత్రి రోజున ప్రకటించనున్నారు. అంతేకాదు ఉగాది కానుకగా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసి దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

వెంకటేష్ నటించిన 'సైంధవ్'  విషయానికొస్తే..  ఈ యేడాది సంక్రాంతి కానుకగా 'సైంధవ్‌' అంటూ స్టైలిష్‌ యాక్షన్ ఎంటర్టేనర్‌తో పలకరించాడు వెంకీ మామ. ఈ మూవీ కాన్సెప్ట్ బాగున్నా.. సంక్రాంతి సినిమాల్లో శాండ్‌విచ్ అయిపోయింది. విడుదలైన ఒక రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర చాప చుట్టేసింది. 'సైంధవ్‌' మూవీ గతేడాది చివర్లో విడుదల కావాల్సింది. కానీ ప్రభాస్ 'సలార్' కారణంగా  సంక్రాంతి వంటి తీవ్ర పోటీలో విడుదలైంది. అయితే పండగ సీజన్‌లో   హనుమాన్, గుంటూరు కారం వంటి సినిమాలతో పాటు నాగార్జున హీరోగా నటించిన 'నా సామి రంగ' సినిమాలతో పోటీగా విడుదలైంది. ఈ సినిమాల మధ్య సైంధవ్ పూర్తిగా నలిగిపోయింది.  ఆ సంగతి పక్కన పెడితే.. వెంకటేష్.. ఇపుడు అనిల్ రావిపూడితో చేయబోతున్న సినిమాతో మళ్లీ హీరోగా బ్యాక్ బౌన్స్ అవుతాడా ? లేదా అనేది చూడాలి.

Also Read: Kuppam: చంద్రబాబును ఓడించండి.. కుప్పం అభివృద్ధి చేసుకుందాం: సీఎం జగన్‌ పిలుపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News