Venkatesh: వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా టైటిల్ అదే.. వింటే ఆశ్చర్యపోవడం ఖాయం

Venky-Anil: వెంకటేష్, అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకులు ఉన్న మెప్పించిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మరో సినిమాతో మన ముందుకి రాబోతోంది. అయితే ఈ చిత్ర టైటిల్ గురించి ఒక వార్త ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 11, 2024, 07:46 PM IST
Venkatesh: వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా టైటిల్ అదే.. వింటే ఆశ్చర్యపోవడం ఖాయం

Venkatesh -Anil Ravipudi: ఈ మధ్య వచ్చిన తెలుగు సినిమాలలో.. ఎటువంటి అసభ్యకర కామిడీ లేకుండా.. కుటుంబ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సినిమా ఎఫ్2. ఆరు సంవత్సరాల క్రితం విడుదలైన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరో లాగా నటించిన ఈ సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. కామెడీ సినిమాలు తీయడంలో ముందుంటారు అనిల్ రావిపూడి. జంధ్యాల, ఇవివి సత్యనారాయణ తరువాత.. మళ్లీ కామెడీ జోనర్ లో అలాంటి సినిమాలు తీస్తున్న దర్శకులలో అనిల్ రావిపూడి ముందంజులో ఉంటాడు. ఇక కామెడీ పండించడంలో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి వెంకటేష్ కి అనిల్ రావిపూడి జోడి కావడంతో ఎఫ్2 సెన్సేషనల్ టాక్ తెచ్చుకుంది.

ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎస్3 సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా.. తామిద్దరం రాబోతున్నామని గత కొద్ది రోజుల క్రితమే అనిల్ రావిపూడి ప్రకటించాడు. వెంకటేష్ తో అనిల్ రావిపూడి సినిమా మొదలైందని.. సినిమా యూనిట్ కొద్ది రోజుల క్రితమే తెలియజేసింది. ఈ క్రమంలో ఈ సినిమా పేరు గురించి ఒక వార్త వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది. త్వరలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకి  ఒక ఆసక్తికర టైటిల్ పెట్టినట్లు తాజా సమాచారం. 

‘సంక్రాంతికి వస్తున్నాం’ అనేది ఈ సినిమా టైటిల్ అని వినికిడి. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానున్న విషయాన్ని ముందే ప్రకటించారు. వచ్చే సంవత్సరం జనవరిలో సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పుడు టైటిల్ కూడా దానికి తగినట్టుగానే పెట్టాలి అనుకుంటున్నారంట చిత్ర యూనిట్. ప్రతి సంక్రాంతికి సినిమాల విషయాల్లో ఎలాంటి గొడవలు జరుగుతుంటాయో తెలిసిన విషయమే. సంక్రాంతికి విడుదల చెయ్యాలని.. థియేటర్స్ తమ సొంతం చేసుకోవాలని సినిమా నిర్మాతలు తెగ ట్రై చేస్తుంటారు. మరి అంత కాంపిటేషన్ ఉన్న ఈ సంక్రాంతి సీజన్ పైనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారు సినిమా యూనిట్.

మామూలుగా నాగార్జున సంక్రాంతికి సినిమాలను విడుదల చేస్తూ.. సంక్రాంతికి వస్తున్నాం, కొడుతున్నాం అని చెబుతుంటారు. ఐతే ఇప్పుడు వెంకటేష్ సినిమాకు టైటిల్‌గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని పెడుతుండడం విశేషమే. ఇలాంటి టైటిల్ పెట్టి సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తే పబ్లిసిటీ పరంగా బాగా కలిసొస్తుంది అని ఫీల్ అవుతున్నారు అంట సినిమా యూనిట్. ఈ సినిమా డిఫరెంటుగా ఉంటుందని ఈ మధ్య విడుదలైన అనౌన్స్‌మెంట్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక ఇప్పుడు టైటిల్ కూడా ఇలా డిఫరెంట్ గా పెరిగితే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని మరింత ఆకట్టుకోవడం ఖాయంలా కనిపిస్తోంది.

Read more: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...

Read more: Ayodhya Ram lalla: ద్యావుడా.. అయోధ్యలో భక్తులకు తిలకం పెడుతూ బాలుడు ఈ రేంజ్ లో సంపాదిస్తున్నాడా..?.. వైరల్ వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News