HBD Venkatesh: మన వెంకీ మామ గురించి తప్పక తెలుసుకోవలసిన విషయాలు

Venkatesh: ఒక్కో సినీ ప్రేక్షకుడికి ఒక్కో ఫేవరెట్ హీరో ఉంటారు.. కానీ ఏ హీరో అభిమానైనా తప్పక ఇష్టపడే హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది మన వెంకీ మామ.. ఆయనకు అసలు యాంటీ ఫ్యాన్స్ లేరు అనడంలో అతిశయోక్తి లేదు…

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2023, 11:06 AM IST
HBD Venkatesh: మన వెంకీ మామ గురించి తప్పక తెలుసుకోవలసిన విషయాలు

Venkatesh Birthday Special: విక్టరీ వెంకటేష్.. ఈ పేరు వింటే ఆరు సంవత్సరాల చిన్న పాప దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలి వారి వరకు…ఆయన్ని అభిమానించే వారే ఉంటారు. ఆయన్ని అభిమానించని వారు ఉండరు అన్నడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏ హీరో ఫ్యాన్ అయినా సరే వెంకటేష్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే తమ సొంత సినిమాలనే భావిస్తారు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ గురించి చెప్పనవసరం లేదు. వెంకీ మామ సినిమా విడుదలవుతోంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి అదొక పండగ. ఎలాంటి క్యారెక్టర్ నైనా తన నేచురల్ యాక్టింగ్ తో రఫ్ ఆడించే అతి కొద్ది మంది హీరోల్లో మన వెంకటేష్ ముందుంటారు. అలాంటి మన వెంకీ మామ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం..

తెలుగు సినిమా పరిశ్రమలో విజయాన్ని తన ట్యాగ్ లైన్ గా మార్చుకొని విక్టరీ వెంకటేష్ గా పేరొందిన దగ్గుబాటి వెంకటేష్.. అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ సాధించిన డి.రామానాయుడు రెండవ కుమారుడు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ ఆ తర్వాత తన శ్రమతో టాప్ హీరోగా ఎదిగారు.

చెన్నైలో డిగ్రీ పూర్తి చేశాక మన వెంకీ అమెరికాలో తన ఎంబీఏ కోర్సును పూర్తి చేశారు.కాగా 1971లో విడుదలైన నాగేశ్వరరావు సినిమా 'ప్రేమ నగర్' తో బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే హీరోగా ఆయన చేసిన మొదటి సినిమా మాత్రం 'కలియుగ పాండవుల'. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా తొలి చిత్రంతోనే నంది అవార్డును కూడా అందుకున్నారు. ఇక ఆ తరువాత స్వర్ణకమలం, వారసుడొచ్చాడు, ప్రేమ, శ్రీనివాస కళ్యాణం,‌కూలీ నెం.1 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి వరుస విజయాలను అందుకున్నాడు.

అంతేకాదు ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీకి ఎంతో మంది స్టార్ హీరోయిన్లను పరిచయం చేసింది వెంకీ మామనే. మీనా, సౌందర్య, సిమ్రాన్ లాంటి వారితో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు వెంకటేష్.

ఇక తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారంతా మన వెంకీ స్కూల్ నుంచి వచ్చిన వారే. టబు దగ్గర నుంచి ప్రస్తుతం బాలీవుడ్ ని ఏలుతున్న కత్రినా కైఫ్ వరకు మొదట నటించింది మన వెంకటేష్ సినిమాలోని. దివ్య భారతి,  గౌతమి, ప్రేమ, ఆర్తీ అగర్వాల్, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అంజలా జవేరి లాంటి స్టార్ హీరోయిన్లు వెంకీ సినిమాలతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 

కాగా వెంకటేష్ హీరో కాకముందే 1985లో వెంకటేష్, నీరజల వివాహమైంది. వీరికి హయవాహిని, ఆశ్రిత, భావన ముగ్గురు అమ్మాయిలు, అర్జున్‌ రామంత్‌ అనే కుమారుడు ఉన్నాడు. 

అందరూ అభిమానించే హీరోగా పేరు తెచ్చుకున్న వెంకటేష్ ఎప్పుడు కూడా వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. తన సినిమాల గురించి తప్ప వ్యక్తిగత విషయాలను బయటకు రాకుండా చూసుకుంటారు.  కాగా రామా నాయుడు కొడుకు అలానే సురేష్ బాబు తమ్ముడు అయిన వెంకటేష్ ఆయన ఆస్తుల విలువ సుమారు రూ. 2 వేల కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. రామానాయుడు స్టూడియోలో వాటాతో కలిపి మరింత ఎక్కువే ఉండవచ్చని టాక్. 

Also Read:  Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా

Also Read:  Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News