Venkatesh: హాట్రిక్ కాంబోకు రెడీ అవుతున్న వెంకీ మామ.. హిట్టు కోసం పక్కా ప్లాన్..

Venkatesh: సిని ఇండస్ట్రీలో ఒక హీరో, దర్శకుడు కాంబినేషన్‌లో సినిమా హిట్టైయిందంటే ఆ కాంబినేషన్‌కు ఉండే క్రేజే వేరప్ప. అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్‌ను రిపీట్ చేయబోతున్నారు వెంకటేష్. తనకు గతంలో రెండు సక్సెస్‌లు ఇచ్చిన దర్శకుడు, నిర్మాతతో కలిసి మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 2, 2024, 03:37 PM IST
Venkatesh: హాట్రిక్ కాంబోకు రెడీ అవుతున్న వెంకీ మామ.. హిట్టు కోసం పక్కా ప్లాన్..

Venkatesh: వెంకటేష్ ఈ యేడాది సంక్రాంతి కానుకగా 'సైంధవ్‌' అంటూ స్టైలిష్‌ యాక్షన్ ఎంటర్టేనర్‌తో పలకరించారు. ఈ మూవీ కాన్సెప్ట్ బాగున్నా.. సంక్రాంతి సినిమాల్లో శాండ్‌విచ్ అయిపోయింది. విడుదలైన వారం రోజుల్లోనే పెట్టా బేడా సర్ధుకొని థియేటర్స్ నుంచి వెళ్లిపోయింది. ఈ మూవీ గతేడాది చివర్లో విడుదల కావాల్సిన ఈ మూవీ ప్రభాస్ 'సలార్' కారణంగా  సంక్రాంతి వంటి తీవ్ర పోటీలో విడుదలైంది. అయితే పండగ సీజన్‌లో   హనుమాన్, గుంటూరు కారం వంటి సినిమాలతో నాగార్జున హీరోగా నటించిన 'నా సామి రంగ' సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాల మధ్య సైంధవ్ పూర్తిగా నలిగిపోయింది.

ఆ సంగతి పక్కన పెడితే.. వెంకటేష్ ఇపుడు మరోసారి హాట్రిక్ కాంబినేషన్‌కు రెడీ అవుతున్నట్టు సమాచారం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో మరో మూవీకి ఓకే చెప్పినట్టు సమాచారం. ఎఫ్ 2, ఎఫ్ 3 మూవీల తర్వాత రాబోతున్న మూడో ఫ్రాంఛైజీగా ఈ మూవీ రాబోతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే F3లో సినిమా చివరల్లో ఈ సినిమాకు మూడో సీక్వెల్ ఉంటుందని చెప్పారు. అందుకు తగ్గట్టే అనిల్ రావిపూడి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసాడట. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.

ఇక వెంకటేష్ నటించిన సైంధవ్ విషయానికొస్తే.. ఈ మూవీలో యాక్షన్ కమ్ పాప సెంటిమెంట్ ఎక్కువగా ఉండటంతో ఓ జానర్ ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. మరోవైపు ఈ సినిమాలో  ఉన్న విపరీతమైన హింస కారణంగా ఈ మూవీ సంక్రాంతి పోటీలో అడ్డంగా బుక్కైపోయింది.తన బేస్ కుటుంబ ప్రేక్షకులకు దూరంగా ఈ సినిమా ఉండటం సైంధవ్‌కు ప్రతికూలంగా మారింది.

ఇక 'సైంధవ్' సినిమా వెంకటేష్ కు 75వ సినిమా. తన లాండ్ మార్క్ చిత్రాన్ని డైరెక్టర్ శైలేష్ కొలను స్టైలిష్ యాక్షన్ ఎంటర్టేనర్‌గా  తెరకెక్కించినా.. హీరోకు విలన్స్ ఎందుకు భయపడతారనే విషయాన్ని తెరపై కన్విన్స్‌గా చెప్పడంలో తడబడ్డాడు.  తన గత రెండు చిత్రాలు 'హిట్ -1, హిట్ -2 చిత్రాలను పోలీస్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించిన శైలేష్ కొలను.. ఈ చిత్రాన్ని మాఫియా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించాడు.  అయినా పెద్దగా వర్కౌట్ కాలేదు.

ముఖ్యంగా ఇలాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టేనర్‌లను ఏ సినిమా పోటీలో లేకుండా విడిగా ఏ పోటీ లేకుండా రిలీజ్ చేస్తే మంచి ప్రయోజనం అయినా దక్కేది. కానీ సంక్రాంతి సీజన్ అంటూ ఎగబడి మొత్తానికి ఎసరు తెచ్చుకున్నారు.ఏది ఏమైనా తన కెరీర్‌లో లాండ్ మార్క్ మూవీగా నిలిచిపోతుందనున్న 'సైంధవ్' వెంకటేష్‌కు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ మూవీలో ఇతర ముఖ్యపాత్రల్లో నవాజుద్దీన్ సిద్దిఖీ, ముఖేష్ రుషి, జిషుసేన్ గుప్తా నటించారు. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్,రుహాని శర్మ ఫీమేల్ లీడ్ పాత్రల్లో కనిపించారు. మొత్తంగా రూ. 30 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ కనీసం రూ. 10 కోట్ల షేర్ రాబట్టలేపోయింది.

ఇక సైంధవ్ మూవీ థియేట్రికల్ రన్ ముగిసింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకుంది. రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ వెర్షన్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ప్యాన్ భారత్ మూవీ అంటూ హంగామా చేసిన ఈ మూవీ ఓటీటీలో ఏ మేరకు ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తుందో చూడాలి.ఈ మూవీ శాటిలైట్ హక్కులను ఈటీవీ దక్కించుకుంది.

Also read: TS School Holiday: విద్యార్థులకు అలర్ట్.. ఫిబ్రవరి 8న స్కూళ్లకు సెలవు.. కారణం ఇదే..!

Also read: Ayodhya Ram Mandir Darshan: బాలరాముని దర్శనానికి భారీ రద్దీ.. ఆలయ సమయంలో మార్పులు.. కొత్త షెడ్యూల్ ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

 

 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News