'అజ్ఞాతవాసి'లో వెంకీ సీన్ మేకింగ్ వీడియో

అజ్ఞాతవాసి సినిమాలో వెంకీ సీన్‌ డబ్బింగ్ మేకింగ్ వీడియో 

Updated: Jan 13, 2018, 11:42 AM IST
'అజ్ఞాతవాసి'లో వెంకీ సీన్ మేకింగ్ వీడియో

ఇప్పటికే అజ్ఞాతవాసి సినిమా చూసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మరోసారి ఆ సినిమాను చూడాలని అనుకునే సందర్భం ఇది. గోపాల గోపాల సినిమాలో పవన్ కల్యాణ్, వెంకటేశ్ కలిసి నటించడం, ఒకే తెరపై ఇద్దరు స్టార్ హీరోలని కలిసి చూసే అవకాశం రావడం అప్పట్లో ఇద్దరు హీరోల అభిమానులని అబ్బూరపర్చింది. అయితే, అప్పటిలాగే మరోసారి ఆ ఇద్దరినీ ఒకే తెరపై చూసే అవకాశం అజ్ఞాతవాసి సినిమాతో ఆ ఇద్దరు స్టార్ హీరోల అభిమానులకి లభించింది. అజ్ఞాతవాసి సినిమాలో అతిథి పాత్ర పోషించిన విక్టరీ వెంకటేష్ సన్నివేశాలని 10వ తేదీన రిలీజైన సినిమాలో జోడించలేదు. అయితే, ఇకపై ప్రదర్శించే షోలలో వెంకీ అతిథి పాత్ర సన్నివేశాలని కూడా జోడించనున్నట్టు ఆ చిత్ర నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ స్పష్టంచేసింది. అంతేకాకుండా ఆ సీన్స్‌కి సంబంధించిన డైలాగ్స్ కోసం డబ్బింగ్ చెబుతున్న ఓ మేకింగ్ సన్నివేశాన్ని సైతం విడుదల చేసింది చిత్ర నిర్మాణ సంస్థ.

ఈ మేకింగ్ వీడియోలో  "గురువు గారు... గురువు గారూ.. అంటూ పవన్ కల్యాణ్ పిలుస్తుండగా.. గారు అక్కర్లేదమ్మా.. గురువు చాలు! ఏంటో చెప్పు" అని వెంకీ డబ్బింగ్ చెబుతున్న తీరు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. సినిమా రిలీజైన తర్వాతి రోజు విడుదలైన ఈ యూట్యూబ్ వీడియోను ఇప్పటికే 1.1 మిలియన్ వ్యూయర్స్ వీక్షించారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరూ కూడా ఓ లుక్కేస్తే పోలా!!