Liger Movie Review: విజయ్ దేవరకొండ "నత్తి విశ్వరూపం" ఎలా ఉందంటే?

Liger Movie Review in Telugu: విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాధ్ కాంబినేషన్లో రూపొందిన లైగర్ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 25, 2022, 12:51 PM IST
Liger Movie Review: విజయ్ దేవరకొండ "నత్తి విశ్వరూపం" ఎలా ఉందంటే?

Liger Movie Review in Telugu: ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దశలో పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో లైగర్ అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే దాదాపుగా ప్రేక్షకులందరిలో మంచి ఆసక్తి ఏర్పడింది. సాధారణంగా హీరో క్యారెక్టర్ ను వేరే లెవల్లో ప్లాన్ చేసుకునే పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండని ఎలా చూపించబోతున్నాడా అని అందరిలోనూ ఆసక్తి రేగింది. దానికి తోడు రమ్యకృష్ణ విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించడం మైక్ టైసన్ వంటి కిక్ బాక్సర్ తొలిసారి ఒక భారతీయ సినిమాలో కనిపిస్తూ ఉండడంతో పాటు నార్త్ హీరోయిన్ అనన్య పాండే కూడా ఉండడంతో సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను మరింత పెంచే విధంగా సినిమా నుంచి విడుదలైన క్రమంలో పాటలు, టీజర్, ట్రైలర్ ఉండడంతో ప్రేక్షకులలో ఈ సినిమా ఎప్పుడు వస్తుందని విపరీతంగా ఎదురు చూశారు. మరి ప్రేక్షకుల ఎదురుచూపులు ఫలిస్తూ ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం

లైగర్ కథ: 
ఒక్క లైన్లో కథ చెప్పాలంటే మిక్స్ మార్షల్ ఆర్ట్స్ లో నేషనల్ ఛాంపియన్ కావాలని కలలుగానే ఒక కరీంనగర్ యువకుడు ముంబై దాకా వెళ్లి దాన్ని ఎలా సాధించాడు అనేది కథ. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో నేషనల్ అవార్డు సాధించాలని భావించిన బలరాం అనుకోకుండా నేషనల్స్ కు వెళ్లకుండానే మృత్యువాత పడతాడు. అతని భార్య బాలామణి(రమ్యకృష్ణ) తన కుమారుడు లైగర్ ను తీసుకుని తన భర్త ఆశయాన్ని సాధించడమే లక్ష్యంగా ముంబైలో అడుగుపెడుతుంది. చాయ్ అమ్ముకుని కొడుకుని తన భర్త చేతిలో ఓడిపోయి ప్రస్తుతం మిక్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నడుపుతున్న రోనిత్ రాయ్ దగ్గరకు వెళ్లి డబ్బు లేకుండానే తన కుమారుడికి ట్రైనింగ్ ఇవ్వాలని కోరుతుంది.

ముందు కాదన్నా తరువాత బలరాం కొడుకని తెలియడంతో రోనీత్ రాయ్ ఒప్పుకుంటాడు. అయితే ట్రైనింగ్ తీసుకునేందుకు సిద్దమైన లైగర్ తాన్య(అనన్య పాండే)తో ప్రేమలో పడతాడు. అయితే అనూహ్య పరిస్థితిలో తాన్యా లైగర్ ను వదిలేస్తుంది. అలా వదిలేయడానికి కారణం ఏమిటి? నిజంగానే తాన్యా, లైగర్ ను మోసం చేసిందా? తాన్య సోదరుడు సంజు(విషు రెడ్డి) పాత్ర ఏమిటి? నేషనల్స్ గెలిచిన తర్వాత ఇంటర్నేషనల్ ఛాంపియన్ గా లైగర్ అవతరించాడా? అలాగే తన స్ఫూర్తి అని భావించే మైక్ టైసన్ తోనే విజయ్ దేవరకొండ ఎందుకు పోరాడాల్సి వస్తుంది? మరి మైక్ టైసన్ మీద లైగర్ గెలుస్తాడా? చివరికి ఇంటర్నేషనల్స్ లో లైగర్ గెలుస్తాడా? అనేది సినిమా కథ.  

విశ్లేషణ:
సాధారణంగా పూరి జగన్నాథ్ సినిమా అనగానే తెలుగు ప్రేక్షకులు కొన్ని ఆశించి థియేటర్లకు వెళతారు. కానీ లైగర్ విషయంలో ఆ అంచనాలన్నీ తప్పినట్లే. ఇది పూర్తిస్థాయి తెలుగు సినిమా అని అనలేము. ఎందుకంటే తెలుగువారు చాలా తక్కువ మంది కనిపించారు. పాన్ ఇండియా మూవీ కావడంతో ఇతర భాషలకు చెందిన నటీనటులను తీసుకునేందుకు పూరి జగన్నాధ్ ఆశక్తి చూపించారు. కొన్ని తెలుగు ముఖాలు అయినా సరే బ్యాక్ గ్రౌండ్ లో కనిపించే వారంతా కొత్తగా కనిపిస్తూ ఉండడంతో తెలుగు ప్రేక్షకులు సినిమాకి కనెక్ట్ అవ్వడం కష్టమే. అలాగే సినిమా అంతా కూడా ముంబై నేపథ్యంలో సాగుతూ ఉంటుంది కాబట్టి తెలుగు ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అవ్వదు అని చెప్పాలి.

గతంలో ఇతర రాష్ట్రాల నేపథ్యంలో చేసిన చాలా సినిమాలు ఉన్నాయి కానీ ఆ బ్యాక్ గ్రౌండ్లో కనిపించే వారంతా కూడా తెలుగువారితోనే నింపేవారు. కానీ లైగర్ విషయంలో మాత్రం పాన్ ఇండియా మూవీ కావడంతో ఇతర భాషలకు చెందిన నటీనటులను కూడా అడపాదడపా చూపించే ప్రయత్నం చేశారు. అయితే పూరీ జగన్నాథ్ అయితే ఎంత ప్రయత్నం చేసినా సరే కథ-కథనం బలంగా లేకపోవడంతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. తాను సాధారణంగా సినిమాలు ఫాస్ట్ గా చేసేస్తాను, ఈ సినిమా విషయంలోనే చాలా టైం తీసుకుని చేశానని చెబుతున్న పూరి జగన్నాథ్ కథ, కథనం మీద దృష్టి పెట్టకపోవడంతో మొదటికే మోసం వచ్చింది. భర్త ఆశయాన్ని సాధించడం కోసం భార్య కుమారుడిని తీసుకుని ముంబై వెళ్లడం బాగానే ఉంది కానీ అప్పటి వరకు లైగర్ ఏం చేశాడు? మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో కొంత శిక్షణ ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? వంటి విశేషాలను చూపించకపోవడంతో ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ కావడం కాస్త కష్టమే.

అయితే నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఎక్కువగా ఫైట్స్ అలాగే వారికి నచ్చే విధంగా సాంగ్స్ రూపొందించారు మేకర్స్. ఒకరకంగా ఇది హిందీలో రూపొంది తెలుగులో రీమేక్ చేయబడిన సినిమాలా  అనిపిస్తుంది కానీ పూర్తిస్థాయి తెలుగు సినిమా అనలేము. ఒకవేళ అలా అని అనుకున్నా సరే కథ బలంగా లేకపోవడంతో నార్త్ ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అవ్వలేరు. హిందీ ఆడియన్స్ కి మాత్రం మాస్ ఫైట్లు డాన్సులు ఇష్టం కాబట్టి వారికి కనెక్ట్ అయితే పూరీ జగన్నాథ్ ప్రయత్నం సఫలీకృతం అయినట్లే. కానీ బాలీవుడ్ స్టార్ హీరోలు చేసిన సినిమాలనే పట్టించుకోని బాలీవుడ్ జనం కొత్తగా తెలుగు సినీ పరిశ్రమ నుంచి వచ్చిన పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండలను పట్టించుకుంటారా? అనేదానిమీద లైగర్ భవితవ్యం ఆధారపడి ఉంది.

నటీనటుల పనితీరు:
ఈ సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాల మీద మోయడానికి సిద్ధమయ్యాడు విజయ్ దేవరకొండ. అయితే హీరోకి ఏదో ఒక అవలక్షణం పెడితే సినిమాలు హిట్ అవుతున్నాయి అనుకున్నాడో ఏమో తెలియదు గానీ విజయ్ దేవరకొండకు నత్తి ఉన్నట్లుగా ఫిక్స్ చేశారు. అయితే ఈ నత్తితో హీరో మాట్లాడడానికి పడే ఇబ్బందులతో కామెడీ పుట్టించాలి అని అనుకున్నారు కానీ ఒకానొక దశలో సినిమా మీద ఈ పాత్ర తెప్పించే అవకాశాలు కూడా ఉన్నాయి. విజయ్ దేవరకొండ పాత్ర మలుచుకున్న తీరు మాత్రం బాగుంటుంది. ఇక ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ చాలా కష్టపడ్డాడు కానీ కథా బలం తోడవకపోవడంతో విజయ్ పాత్ర మరింత ఎలివేట్ అయ్యే అవకాశాన్ని కోల్పోయింది.

అనన్య పాండే కేవలం అందాల ఆరబోతకు మాత్రమే పరిమితమైంది. ఆమె డబ్బింగ్ సింక్ కూడా సరిగా కుదరలేదు. రమ్యకృష్ణ లాంటి నటి కూడా ఒక్కో సీన్లో ఓవరాక్షన్ చేస్తుందేమో అనే విధంగా అనిపిస్తుంది. ఇక కేవలం కనిపించిన రెండు మూడు సీన్లలోనే ఆలీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. గెటప్ శ్రీను కామెడీ అక్కడక్కడ నవ్విస్తుంది. ఇక హీరోయిన్ సోదరుడు పాత్రలో నటించిన విషు రెడ్డి తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక రోనిత్ రాయ్ నటన తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. మకరంద్ దేశ్ పాండే సహా ఇతరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. 

సాంకేతిక విభాగం పనితీరు విషయానికి వస్తే
టెక్నికల్ టీమ్ అంతా దాదాపుగా బాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకున్నట్లే కనిపించింది. కనీసం సంగీతం ఎవరు అందించారు అనే విషయం మీద కూడా సరైన క్లారిటీ లేదు. మ్యూజిక్ డైరెక్టర్ పేరు లేపేసి మ్యూజిక్ సూపర్వైజర్ అనే పేరు వేశారు. కానీ ఆయన కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని వ్యక్తి. అయితే కొన్ని పాటలు వినడానికి బాగున్నాయి గాని విజువల్ గా మాత్రం తెలుగు ప్రేక్షకులకు కాస్త కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా ఉన్నాయి. సినిమా ఎడిటింగ్ మాత్రం ఎక్కడా అనవసరమైన సీన్లు లేకుండా సరిపోయింది. సినిమాటోగ్రఫీ సినిమాను మరో లెవల్ కు తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఫైటింగ్ సీన్స్ లో వారి ప్రతిభ కనిపిస్తుంది. డిఐ విషయంలో మాత్రం ఎందుకో లైట్ తీసుకున్నట్లు అనిపిస్తుంద. కొన్నిచోట్ల డిఐ జరగలేదని విషయం సాధారణ ప్రేక్షకులకు కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇక నిర్మాణ విలువలు కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. సినిమాని ఎక్కువ భాగం ముంబై అలాగే లాస్ ఏంజెల్స్ లో షూట్ చేసినట్లు కనిపిస్తోంది. 

ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలంటే
ఈ లైగర్ అందరికీ నచ్చకపోవచ్చు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వకపోవచ్చు బూతు డైలాగులు దండిగా ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా కూడా కాదు. వీకెండ్ స్నేహితులతో వెళ్లాలనుకుంటే వెళ్లి చూడగల వన్ టైం వాచబుల్ యాక్షన్ మూవీ ఈ లైగర్.

 

నటీనటులు - విజయ్ దేవరకొండ, మైక్ టైసన్, అనన్య పాండే, రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే మరియు గెటప్ శ్రీను

ఎడిటర్ - జునైద్ సిద్ధిఖీ

నిర్మాతలు  - పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్, హీరో యష్ జోహార్, కరణ్ జోహార్, మరియు అపూర్వ మెహతా
స్క్రీన్ ప్లే & డైలాగ్స్ అండ్ డైరెక్షన్ : పూరి జగన్నాధ్ 

స్టంట్ డైరెక్టర్ - కెచ 

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - విషు రెడ్డి
మ్యూజిక్ సూపర్‌వైజర్ - అజీమ్ దయాని

రేటింగ్: 2.5/5

Also Read: Anupama Parameswaran Covid: అనుపమ పరమేశ్వరన్‌కు కరోనా!

Also Read: Liger Twitter Review: ప్రేక్షకుల ముందుకొచ్చేసిన విజయ్ దేవరకొండ 'లైగర్'.. సినిమాపై ట్విట్టర్‌ రివ్యూ ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News