Villain: విలన్ పాత్ర కోసం ఏకంగా రూ. 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్యాన్ ఇండియా హీరో.. కమల్ కాదు.. ఎవంటే.. ?

Villain: సాధారణంగా మన దగ్గర హీరోలకున్న డిమాండ్ విలన్స్‌కు అంతగా ఉండదు. విలన్ ఎంత మంచి యాక్టింట్ చేసినా.. చివరకు హీరో చేతిలో చావు దెబ్బులు తినాల్సిందే. కానీ గత రెండు సినిమాలతో ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటిన ఈ కథానాయకుడు.. ఇపుడు రాబోయే బిగ్ ప్రాజెక్ట్‌లో విలన్‌గా యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాడు. అందుకు రూ. 150 కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడట.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 7, 2024, 12:15 PM IST
Villain: విలన్ పాత్ర కోసం ఏకంగా రూ. 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్యాన్ ఇండియా హీరో.. కమల్ కాదు.. ఎవంటే.. ?

Yash As Villain in Ramayanam : ఒక్క సినిమా.. ఒకే సినిమా కెరీర్ మొత్తం టర్న్ చేయడానికి. అదే జరిగింది యశ్ విషయంలో. కేజీఎఫ్ మూవీ విడుదల వరకు యశ్ పేరుతో ఓ హీరో ఉన్నాడన్న సంగతే చాలా మందికి తెలియదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కేజీఎఫ్ 1', 'కేజీఎఫ్ 2' చిత్రాలతో యశ్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. కేజీఎఫ్ సిరీస్‌తో యశ్ ప్యాన్ ఇండియా స్టార్‌ అయ్యాడు. కేజీఎఫ్ 2  సినిమాకు అప్పట్లో రూ. 50 కోట్లకు పైగానే బిజినెస్ చేయడం విశేషం. యశ్ ప్రస్తుతం కన్నడలో నెంబర్ వన్ హీరో. అక్కడ తొలి రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన హీరోగా రికార్డు క్రియేట్ చేసాడు. కేజీఎఫ్ తర్వాత ఎంతో గ్యాప్ తీసుకొని ఓ సినిమాను రీసెంట్‌గా అనౌన్స్ చేశాడు. ఈ సినిమాతో పాటు హిందీలో రామాయణం పేరుతో దంగల్ డైరెక్టర్ నితీష్‌ తివారీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను మధు మంతెన, అల్లు అరవింద్ సహా బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాతలు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు.

ఆదిపురుష్ సినిమా తర్వాత రాబోతున్న ఈ సినిమాకు 'రామాయణం' టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో ప్రభు శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి దాదాపు ఫిక్స్ అయింది. మరోవైపు ఈ సినిమాలో కీలకమైన రావణాసురుడి పాత్ర కోసం యశ్ ను ఎంపిక చేసారు. ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం యశ్‌కు రూ. 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరోవైపు రాముడి పాత్రలో నటిస్తోన్న రణ్‌బీర్ కపూర్‌కు రూ. 100 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారట. అటు సాయి పల్లవికి రూ. 5 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారట. మొత్తంగా 'రామయణం'పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభు శ్రీరాముడి పాత్ర చేస్తోన్న రణ్‌బీర్ కపూర్ కంటే.. రావణ బ్రహ్మ పాత్రలో నటిస్తోన్న యశ్‌కు ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడం విశేషం. ఈ సినిమాకు యశ్‌తో సౌత్ మార్కెట్ మొత్తం క్యాప్చర్ చేయవచ్చనే ఉద్దేశ్యంతో అతన్ని ఒప్పించి ఈ సినిమాలో యాక్ట్ చేసేలా చేసారనేది టాక్. ఇక కమల్ హాసన్.. కల్కి మూవీ కోసం రూ. 25 కోట్ల వరకే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. దాంతో పోలిస్తే ఇది ఎక్కువే అని చెప్పాలి.

ఇక మన పురాణాలైన రామాయణం పై ఎవరికీ ఎలాంటి పేటెంట్ హక్కులు ఉండవు. ఎవరైనా ఎన్ని సార్లైనా తెరకెక్కించవచ్చు. ముఖ్యంగా పౌరాణిక, చారిత్రక కథలకు కాపీ రైట్ లాంటివి ఉండవు కాబట్టి ఎవరైనా ఇలాంటి తరహా పురాణ కథలతో సినిమాలు తెరకెక్కించవచ్చు. ప్రభాస్, కృతి సనన్‌లతో గతేడాది తెరకెక్కించిన 'ఆదిపురుష్' మూవీని దర్శకుడు ఓంరౌత్ పూర్తిగా వక్రీకరించి తెరకెక్కించడం వివాదాస్పదమైంది. మరి అలాంటి తప్పులు చేయకుండా అందరి ఆమోద యోగ్యంగా  రామాయణం సినిమాను తెరకెక్కిస్తారా లేదా అనేది చూడాలి.

Read More: Actress Kajal Agarwal: హీరోయిన్ కాజల్ అగర్వాల్ నడుముపై చెయివేసిన అభిమాని.. సోషల్ మీడియాలో రచ్చగా మారిన వీడియో ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News