Yatra 2 Movie: యాత్ర-2 టీజర్‌ వచ్చేస్తోంది.. పోస్టర్ రిలీజ్

Yatra 2 Movie Teaser Updates: యాత్ర-2 టీజర్‌ను ఈ నెల 5వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఫిబ్రవరి 8వ తేదీన ఆడియన్స్‌ ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో జోరు పెంచారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2024, 07:35 PM IST
Yatra 2 Movie: యాత్ర-2 టీజర్‌ వచ్చేస్తోంది.. పోస్టర్ రిలీజ్

Yatra 2 Movie Teaser Updates: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మూవీ యాత్ర. 2019లో విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘యాత్ర 2’ తెరకెక్కుతోంది. వైఎస్ఆర్ పాత్రలో మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్న విషయం తెలిసిందే. మహి వి. రాఘవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో 2009 నుంచి 2019 ఏపీలో జరిగిన రాజకీయ సంఘటనలు చూపించనున్నారు. యాత్ర మూవీలో వైఎస్ఆర్ పాదయాత్రను ప్రధాన ఘట్టంగా చూపించగా.. ఈ మూవీలో జగన్ పాదయాత్రను హైలెట్ చేసే అవకాశం ఉంది. 
 
ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర-2 సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నట్లు ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేశారు. త్వరలోనే టీజర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. జనవరి 5వ తేదీన టీజర్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి అధికార పోస్టర్ రిలీజ్ చేశారు. మమ్ముట్టి, జీవా పోస్టర్‌లో ఉన్నారు. తండ్రి వెనుక తనయుడు నిలబడ్డాడు. పోస్టర్‌లో జీవా అచ్చం జగన్‌లానే ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

'నేను ఎవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకును..' అని పోస్టర్‌పై రాశారు. ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పోస్టర్ మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.

 Also Read: Samyuktha Menon: సంయుక్త మీనన్ పెళ్లి.. వైరల్ అవుతున్న న్యూస్..

Also Read: Redmi Note 13 Pro 5G: Redmi Note 13 సిరీస్‌ మొబైల్స్‌ల ధరేంతో తెలుసా? లీక్‌ అయిన ధర, ఫీచర్స్‌ వివరాలు! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News