చెంప ఛెళ్లుమనిపిస్తానంటున్న హీరోయిన్ !

చెంప ఛెళ్లుమనిపిస్తా ఏమనుకుంటున్నావో.. దమ్ముంటే యూజర్ నేమ్ చాటున దాక్కుని కామెంట్స్ పెట్టడం కాదు: జరీన్ ఖాన్

Last Updated : Feb 20, 2018, 04:33 PM IST
చెంప ఛెళ్లుమనిపిస్తానంటున్న హీరోయిన్ !

చెంప ఛెళ్లుమనిపిస్తా ఏమనుకుంటున్నావో.. దమ్ముంటే యూజర్ నేమ్ చాటున దాక్కుని కామెంట్స్ పెట్టడం కాదు.. నా గురించి ఏం చెప్పాలనుకుంటున్నావో నా ఫేస్ ముందుకొచ్చి చెప్పు! ఇదీ ఓ బాలీవుడ్ హీరోయిన్ తనని ట్విటర్ లో వేధించే ప్రయత్నం చేసిన ఓ ఆకతాయికి ఇచ్చిన రిప్లై. అది కూడా అలా ఇలా మామూలుగా కాదు.. ఎంటీవీ నిర్వహించిన ఎంటీవీ ట్రోల్ పోలీస్ అనే టీవీ షోలో పాల్గొన్న ఆమె.. ఆ టీవీ షో ద్వారా తనని వేధించే ప్రయత్నం చేసిన వాళ్లందరికీ ఘాటైన సమాధానం ఇచ్చింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. 2000 సంవత్సరంలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన వీర్ సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైన క్యూట్ లేడీ జరీన్ ఖాన్. 

ఎంటీవీ ట్రోల్ పోలీస్ లో తాను ట్రోల్స్ ని ఉద్దేశించి ఏం మాట్లాడిందో ఆ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ ద్వారా షేర్ చేసుకుంది జరీన్ ఖాన్. జరీన్ ఖాన్ ఏమని వార్నింగ్ ఇచ్చిందో ఆమె మాటల్లోనే చూడండి!!

 

Trending News