Zee Telugu Award : ఈ ఆదివారం ప్రేక్షకులను ఆదరించడానికి సిద్ధమైపోయిన జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ పార్ట్‌‌-2….

సరికొత్త ప్రోగ్రామ్స్ ని ప్రేక్షకులకు ఇవ్వడంలో ఎప్పుడూ ముందుండే జీ తెలుగు.. ఇప్పుడు జీ తెలుగు అవార్డ్స్ పార్ట్ 2 సెలబ్రేషన్స్ తో ప్రేక్షకులను అల్లరించనుంది. నటీనటుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కి కూడా ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ తారలు, బుల్లితెర నటీనటుల మధ్య అంగరంగ వైభవంగా జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ ఉత్సవాలు జరిగాయి. ఇక ఈ అవార్డ్స్ త్వరలోనే జీ తెలుగులో ప్రసారం కానున్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2023, 02:44 PM IST
Zee Telugu Award : ఈ ఆదివారం ప్రేక్షకులను ఆదరించడానికి సిద్ధమైపోయిన జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ పార్ట్‌‌-2….

Zee Telugu Awards Part 2: తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని అందించేందుకు ఎల్లవేళలా కృషిచేసే ఛానల్ జీ తెలుగు. నటీనటుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరంవలె 2023 సంవత్సరానికిగానూ ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ తారలు, బుల్లితెర నటీనటుల మధ్య అంగరంగ వైభవంగా జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ ఉత్సవాన్ని నిర్వహించింది. 

మహిళల ప్రాధాన్యత ఇనుమడించేలా ప్రత్యేకమైన పింక్ కార్పెట్, జీ తెలుగు కుటుంబం అవార్డుల ప్రధానోత్సవం పార్ట్- 1 ప్రేక్షకులను అలరించింది. ఇక, ఈ మెగా ఈవెంట్ పార్ట్-2ను ఈ ఆదివారం మీముందుకు తెచ్చేందుకు సిద్ధమైంది. ఆకట్టుకునే ప్రదర్శనలు, హృదయాన్ని తాకే క్షణాలు, మరపురాని అనుభవాలతో తెలుగు టెలివిజన్ స్ఫూర్తిని ప్రతిబింబించే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ పార్ట్-2 నవంబర్ 5న సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది.

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ గ్రాండ్ ఎంట్రీతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ఎనర్జిటిక్ యాంకర్స్ అయిన ప్రదీప్ మాచిరాజు-రష్మీ గౌతమ్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఇక, ఈ సందర్భంగా సీరియల్స్, జీ తెలుగు కుటుంబంపై ఆర్జీవీ ప్రశంసలు కురిపించారు. నేచురల్ హీరో నాని రాకతో కార్యక్రమం మరింత సరదాగా మారింది. ఈ కార్యక్రమంలో తండ్రీకొడుకుల మధ్య గాఢమైన బంధాన్ని ప్రతిబింబించేలా నానికి అంకితం చేస్తూ హృదయాన్ని హత్తుకునే నాటకాన్ని ప్రదర్శించారు.  ప్రముఖ యాంకర్ సుమ, రాజీవ్ కనకాల తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని ఈ అవార్డు వేదికపైనే జరుపుకున్నారు. వీరి ప్రేమ కథకు ప్రేక్షకులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. యువ కళాకారిణి గౌతమి తల్లిదండ్రులు అనూహ్యంగా వేదికపై కనిపించడం ఈ వేడుకలో అత్యంత మధుర క్షణాల్లో ఒకటి.

ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా ద్రౌపదిగా నయని నటన, రష్మీ, కావ్య కళ్యాణ్ రామ్ ల అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఉత్తమ యాంకర్, ఎవర్ గ్రీన్ కపుల్, పాపులర్ మేల్ ఫేస్ వంటి అవార్డులతో పాటు మరిన్ని అవార్డులతో నటీనటులను సత్కరించింది జీ తెలుగు. సరదాగా సాగిన ఈ కార్యక్రమానికి బుల్లితెర నటీనటులతోపాటు టాలీవుడ్ తారలు, ప్రముఖులు హాజరై మరింత కళను జోడించారు. అంగరంగ వైభవంగా సాగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ తారలు సంయుక్త మీనన్, సుహాస్, పాయల్ రాజ్‌పుత్, తరుణ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నటీనటుల ఆకట్టుకునే ప్రదర్శనలు, అవార్డు విజేతల స్పీచ్, పలువురు తారలు పంచుకున్న విశేషాలతో కార్యక్రమం ఆద్యంతం సంబరంగా సాగింది. 

కావున నవంబర్ 4న సాయంత్రం 5:30 గంటలకు పింక్ కార్పెట్ పార్ట్ -2, నవంబర్ 5న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ పార్ట్-2 మీ జీ తెలుగులో.. తప్పక చూడండి. 

నవంబర్ 5న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారమయ్యే జీ కుటుంబం అవార్డ్స్ పార్ట్-2లో నైట్ ఆఫ్ గ్లిట్జ్ అండ్ గ్లామర్ ను సెలబ్రేట్ చేసుకుంది.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News