నాగార్జున తనయుడు అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ?

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నాడని పలు పత్రికలు వార్తలు రాయడం గమనార్హం.

Last Updated : Jul 22, 2018, 08:46 PM IST
నాగార్జున తనయుడు అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ?

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నాడని పలు పత్రికలు వార్తలు రాయడం గమనార్హం. ఇప్పటికే అఖిల్, హలో చిత్రాలతో తెలుగులో పెద్ద హిట్లు కైవసం చేసుకోలేకపోయాడు ఈ అక్కినేని వారసుడు. అయితే ఆది పినిశెట్టి సోదరుడు సత్య ఈ మధ్యకాలంలో అఖిల్‌తో ఓ కథ చెప్పారని.. ఆ కథ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌కి కూడా నచ్చడంతో .. వారిద్దరి కాంబినేషన్‌లో ఓ హిందీ సినిమా త్వరలో ప్రారంభయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

సత్య ఇప్పటికే తెలుగులో "మలుపు" లాంటి గ్రిప్పింగ్ థ్రిల్లర్ తెరకెక్కించారు. తాజాగా తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కబోయే అఖిల్ చిత్రం ప్రధానంగా గుర్రపు పందేల బ్యాక్ గ్రౌండ్‌లో నడుస్తుందని వినికిడి. ప్రస్తుతం అఖిల్, వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఆ చిత్రం పూర్తయ్యాకే.. బాలీవుడ్ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గతంలో నాగార్జున కూడా పలు బాలీవుడ్ చిత్రాలలో నటించారు. శివ, మిస్టర్ బేచారా, క్రిమినల్, అగ్నివర్ష, ఎల్‌ఓసీ కార్గిల్, జక్మ్ లాంటి హిందీ చిత్రాలలో నటించి ఉత్తరాది ప్రేక్షకులకు కూడా నాగ్ బాగా దగ్గరయ్యారు. మరి నాగ్ కుమారుడిగా అఖిల్‌ని హిందీ ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారో లేదో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే. 

Trending News