ఎండాకాలంలో దాహార్తికి విరుగుడు..ఈ తాటి ముంజలు

ప్రకృతి ప్రసాదించిన వేసవి వరం ఈ తాటి ముంజలు.

Updated: May 6, 2018, 11:16 AM IST
ఎండాకాలంలో దాహార్తికి విరుగుడు..ఈ తాటి ముంజలు

ప్రకృతి ప్రసాదించిన వేసవి వరం ఈ తాటి ముంజలు. వీటినే 'ఐస్ ఆపిల్స్‌'గా పిలుస్తుంటారు. వేసవికాలంలో మాత్రమే లభించే ఈ ముంజలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మంచి చలువ కూడా. కేలరీలు, విటమిన్లు అధికంగా ఉన్న ఈ ముంజలను తినడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి కల్తీ లేకుండా లభించే వీటిని తప్పకుండా తినాలంటున్నారు. తాటి ముంజులలో శరీరానికి కావాల్సిన ఏ, బీ, సీ విటమిన్లు, ఐరన్, జింక్, పాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు అందుతాయి. ఇది దాహార్తికి మంచి విరుగుడు కూడా.

తాటి ముంజలతో కలిగే లాభాలు:

 • బి.పిని అదుపులో ఉంచి కోలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఎముకలను బలంగా ఉంచుతుంది.
 • రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరం కూడా ఎంతో చల్లగా, హాయిగా ఉంటుంది.
 • మనిషి శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గి జీర్ణక్రియ బాగా జరుగుతుంది.
 • ఎండాకాలంలో ముఖంపై మొటిమలు వస్తుంటాయి. వీటి నుండి ఉపశమనం పొందాలంటే ముంజలను తినడం మంచిది.
 • శరీర బరువును తగ్గించడంలో కూడా ముంజులు తోడ్పడతాయి.
 • తాటి ముంజలతో కాలేయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
 • శరీరంలో ఉండే విష పదార్ధాలను తొలగించడంలో దోహదపడతాయి.
 • వేసవిలో సహజ సిద్ధంగా వచ్చే అలసట, నీరసం, విరేచనాలు, వాంతులు ముంజలు తినడం వల్ల తగ్గుతాయి.
 • కేన్సర్ కణాల నిరోధానికి ముంజలు ఉపయోగపడతాయి.
 • ట్యూమర్, బ్రెస్ట్ కేన్సర్ కణాలను అభివృద్ధి చేసే పెట్రో కెమికల్స్, ఆంథోసైనిన్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి.
 • గ్లూకోజ్ స్థాయిని పెంచి శరీరానికి కావాల్సిన మినరాల్స్, న్యూట్రిన్‌లను బ్యాలెన్స్ చేయడంలో ముంజలు కీలక పాత్ర పోషిస్తాయి.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close