ఆ సినిమా హీరోకి.. ఆత్మలతో అనుభవం ఎదురైందట

భోజపూరి సినిమా కథానాయకుడు రవికిషన్ పలు హిందీ, తెలుగు చిత్రాలలో కూడా నటించారు. ఇటీవలే ఆయన తొలిసారిగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. 

Last Updated : Jul 8, 2018, 06:17 PM IST
ఆ సినిమా హీరోకి.. ఆత్మలతో అనుభవం ఎదురైందట

భోజపూరి సినిమా కథానాయకుడు రవికిషన్ పలు హిందీ, తెలుగు చిత్రాలలో కూడా నటించారు. ఇటీవలే ఆయన తొలిసారిగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. భైరి కంగనా 2 అనే భోజపూరి సినిమా షూటింగ్‌లో ఉన్న ఆయన పలు అనుభవాలను షేర్ చేసుకున్నారు. భైరి కంగనా 2 ఒక హారర్ చిత్రం కాబట్టి... దాని షూటింగ్ కూడా పలు పాతకాలం నాటి కట్టడాలలోనే జరిగిందట. అయితే షూటింగ్ స్పాట్‌లో తనతో పాటు ఎవరో తిరుగుతున్న ఫీలింగ్ తనకు పలుమార్లు కలిగిందని తెలిపారు రవికిషన్.

తాను ఆత్మలను ఎప్పుడూ చూడకపోయినా.. అవి ఉన్నాయేమో అన్న అనుమానం తొలిసారిగా ఆ సినిమా షూటింగ్‌లోనే కలిగిందని తెలిపారు ఆయన. తాను ఆత్మల గురించి పలు సైంటిఫిక్ పుస్తకాలు చదివానని.. తీరని కోరికలు కలిగినవారే ఆత్మలుగా మారతారని అంటుంటారని.. అలాగే అకాల మరణాల బారిన పడిన వారు కూడా ఆత్మలుగా మారే అవకాశం ఉందని రవికిషన్ తెలిపారు.

ప్రస్తుతం ఆయన నటిస్తున్న భోజపూరి చిత్రం భైరి కంగనా 2 చిత్రానికి అశోక్ త్రిపాఠి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అశోక్ శ్రీవాస్తవ నిర్మించగా.. కాజల్ రగ్వాని, శుభ శర్మ, కునల్ సింగ్, సప్నా చౌదరి మొదలైనవారందరూ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జులై 13, 2018న ఈ చిత్రం విడుదల అవుతోంది. రవికిషన్ గతంలో రేసుగుర్రం, కిక్ 2, సుప్రీమ్, ఒక అమ్మాయి తప్ప, రాధ, లై, ఎమ్మెల్యే, సాక్ష్యం మొదలైన తెలుగు చిత్రాలలో విలన్ పాత్రలలో నటించారు. అలాగే బులెట్ రాజా, లక్నో సెంట్రల్, ముక్కాబాజ్, జిల్లా ఘజియాబాద్, రావన్ వంటి హిందీ చిత్రాలలో కూడా నటించారు. 

Trending News