ఆస్తమా ఉన్నవారు ఏవి తినాలి? ఏవి తినొద్దు?

ఆస్తమా బాధితులు కొన్ని ఆహారపదార్థాలను తినకపోవడమే మంచిదని చెబుతున్నారు కొందరు నిపుణులు.

Updated: Sep 25, 2018, 05:05 PM IST
ఆస్తమా ఉన్నవారు ఏవి తినాలి? ఏవి తినొద్దు?

ఆస్తమా బాధితులు కొన్ని ఆహారపదార్థాలను తినకపోవడమే మంచిదని చెబుతున్నారు కొందరు నిపుణులు. ఆరోగ్యానికి సహకరించని ఆ ఆహారపదార్థాల వల్ల శ్వాస సంబంధిత సమస్యలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందంటున్నారు. కాబట్టి ఆస్తమా ఉన్నవారు కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలి. అవేంటో చూద్దాం...

 • ఆస్తమా పేషంట్స్‌ మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు, చేపలు, బీఫ్‌ వంటి ఆహారపదార్థాలను తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల శ్వాసకోస ఇబ్బందులు తలెత్తవచ్చు.
 • సాఫ్ట్‌ డ్రింక్స్‌లో ఉండే కొన్ని రకాల పదార్థాలు కూడా శ్వాసకు ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి ఆస్తమా బాధితులు ఎట్టి పరిస్థితుల్లో సాఫ్ట్‌డ్రింక్స్‌ను తీసుకోకూడదు.
 • కొన్ని రకాల పచ్చళ్లలో సల్ఫైట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది శ్వాసకి సమస్యగా మారవచ్చు. కనుక ఆస్తమాతో బాధపడేవాళ్లు పచ్చళ్లు తినకూడదు.
 • సోడియంకు దూరంగా ఉండటం చాలా అవసరం. ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, ప్యాక్‌ చేసిన ఆలూ చిప్స్‌లో సల్ఫైట్స్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటికీ దూరంగా ఉండటం మంచిది.

ఏఏ పదార్థాలు తినాలి?

 • యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.
 • పచ్చి ఉల్లిపాయలు తీసుకోండి. ఆస్తమాను కలుగచేసే ఇంఫ్లమేషన్లను తగ్గిస్తాయి.
 • రోజు క్రమం తప్పకుండా కాఫీ తాగటం (రోజు మొత్తంలో 3 కప్పుల కన్నా ఎక్కువ కాఫీ తాగకూడదు) వలన ఆస్తమా స్థాయిలు తగ్గే అవకాశం ఉంది.
 • రెండు చెంచాల వెల్లుల్లి, అల్లం కలిపిన టీని రోజు ఉదయం, సాయంత్రం తాగటం వలన ఆస్తమా వ్యాధి కంట్రోల్ అవుతుంది.
 • రోజు ఒక గ్లాసు వేడి నీటిలో తేనెను కలుపుకొని తాగటం వలన ఆస్తమా నుండి ఉపశమనం పొందుతారు.
 • తులసి ఆకులు ఆస్తమాను తగ్గించుటలో శక్తివంతంగా పనిచేస్తాయి.
 • మీలో ఆస్తమా స్థాయిలు పెరిగితే తేనెను ముక్కు దగ్గర పెట్టుకొని దాని వాసనను పీల్చుకోండి.
 • కొన్ని మెంతి విత్తనాలను తీసుకొని ఒక గ్లాసు నీటిలో కలిపి వేడి చేయండి. ఈ మిశ్రమానికి తేనె, వెల్లుల్లి రసంలను కలిపి రోజు ఉదయాన్నే తాగితే ఉపశమనం పొందుతారు.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close