భారతదేశంలో తొలిసారిగా పోషకాహారంపై యాప్

భారతదేశంలో తొలిసారిగా పోషకాహారంపై యాప్ అందుబాటులోకి వచ్చింది.

Updated: Jun 30, 2018, 01:15 PM IST
భారతదేశంలో తొలిసారిగా పోషకాహారంపై యాప్

భారతదేశంలో తొలిసారిగా పోషకాహారంపై యాప్ అందుబాటులోకి వచ్చింది. "న్యూట్రిఫై ఇండియా" పేరుతో రూపొందిన ఈ యాప్‌ను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చి సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. ఈ యాప్ అందరికీ ఎలాంటి పోషకాహారం తీసుకోవాలో తెలియజేస్తుంది.

ముఖ్యంగా పసిపిల్లలు, ఎదుగుతున్న పిల్లలు, మహిళలు, బాలింతలు తీసుకోవాల్సిన పోషకాహారంపై ఈ యాప్‌లో వర్గీకరణ అనేది ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ యాప్‌ను పరిపూర్ణమైన హెల్త్ గైడ్ మాదిరిగా ఉపయోగించుకోవచ్చని అంటున్నారు నిపుణులు.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఈ యాప్‌ను ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో యూజర్ల సౌలభ్యం కోసం My Nutrients Requirements, Nutrients in my Food, My Diet and Activity, Search Food by Nutrition, Search Food by Language లాంటి ప్రత్యేకమైన ఆప్షన్లు ఉన్నాయి.

ఈ ఆప్షన్ల ద్వారా మీ శరీర తత్వాన్ని బట్టి ఎలాంటి డైట్ తీసుకోవాలి, డైట్ తీసుకొనేటప్పుడు పాటించాల్సిన నియమాలు లాంటి అంశాలు అన్ని కూడా ఎంచుకోవచ్చు.

ఆంగ్లం, తెలుగు, హిందీ భాషల్లో మాత్రమే కాకుండా దాదాపు 14 భాషల్లో ఇప్పుడు ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే విదేశాల్లో ఇలాంటి యాప్‌లు అనేకం ఉన్నప్పటికీ భారతదేశంలో తొలిసారిగా ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో డిజైన్ చేసిన తొలి పోషహాకార యాప్ ఇదే కావడం విశేషం.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close