Prabuthwa Junior Kalashala: ఆకట్టుకుంటోన్న 'ప్రభుత్వ జూనియర్ కళాశాల' సాంగ్.. మంగ్లీ మార్కుతో చార్ట్ బస్టర్

Prabuthwa Junior Kalashala Punganur-500143 Movie: ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143 మూవీ నుంచి 'డూడుం డుక్కుడుం' అనే సాంగ్‌ను విడుదల చేశారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ చేతులమీదుగా సాంగ్‌ను రిలీజ్ చేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2023, 05:49 PM IST
Prabuthwa Junior Kalashala: ఆకట్టుకుంటోన్న 'ప్రభుత్వ జూనియర్ కళాశాల' సాంగ్.. మంగ్లీ మార్కుతో చార్ట్ బస్టర్

Prabuthwa Junior Kalashala Punganur-500143 Movie: కాలేజ్ డేస్ ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురజ్ఙాపకం. కాలేజ్‌లో జరిగే ప్రేమ కథలు ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఇప్పటికే చాలా కాలేజ్ లవ్ స్టోరీలు తెరపై సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే యధార్థ సంఘటనను స్పూర్తిగా తీసుకుని.. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143 అనే సినిమాను రూపొందించారు దర్శకుడు శ్రీనాథ్ పులకురం. ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. మరోవైపు ప్రమోషన్స్‌పై మూవీ మేకర్స్ ఫోకస్ పెట్టారు. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్లకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ సాంగ్‌ను విడుదల చేశారు. స్టార్ సింగర్ మంగ్లీ పాడిన 'డూడుం డుక్కుడుం' అనే సాంగ్‌ను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ చేతులమీదుగా విడుదలైంది.

ఈ సాంగ్‌ను మొత్తం విన్న జీవి ప్రకాష్ కుమార్.. అద్భుతంగా ఉందని చిత్రబృందాన్ని ప్రశంసించారు. సాంగ్ మ్యూజికల్‌గా చాలా బాగుందని మెచ్చుకున్నారు. క్లాసికల్ టచ్ ఇవ్వడం తనకు వ్యక్తిగతంగా బాగా నచ్చిందన్నారు. ఈ పాట బాగా నచ్చడంతో.. మిగిలిన పాటలు కూడా ఎలా ఉంటాయోనని ఆసక్తి పెరిగిందని చెప్పారు. ఈ మూవీ కచ్చితంగా మ్యూజికల్ హిట్ అవుతుందని తాను బలంగా చెప్పగలనని అన్నారు.

కార్తీక్ రోడ్రిగ్జ్ అందించిన బాణీలు సమకూర్చగా.. శ్రీ సాయి కిరణ్ లిరిక్స్ రాశారు. తనదైన శైలిలో శ్రోతలందరూ మళ్లీ మళ్లీ వినేలా మంగ్లీ ఆలపించారు. ఈ చిత్రం ఆడియో రైట్స్‌ను ఫాన్సీ రేటుకు టీ సిరీస్ తెలుగు సంస్థ దక్కించుకోగా.. సాంగ్ అదే యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేశారు. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీని థీమ్‌గా  తెరకెక్కిన ఈ సినిమాలో కాలేజీ జంట మధ్య డూడుం డుక్కుడుం అంటూ సాగుతున్న ఈ సాంగ్ అత్యంత ఆసక్తికరంగా ఉంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News