చివరి క్షణాలను హ్యాపీగా గడపాలని ఉంది- బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్

                                                              

Last Updated : Aug 2, 2018, 07:05 PM IST
చివరి క్షణాలను హ్యాపీగా గడపాలని ఉంది- బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్  గుండెలు పగిలే వార్త చెప్పాడు. తాను ఇక బతికేది కొన్ని రోజులే మాత్రమేని తన ఇన్‌స్ట్రాగం ద్వారా తెలిపాడు. ఈ సందర్భంగా ఇర్ఫాన్ మాట్లాడుతూ తన జీవితకాలం కొన్ని నెలలు.. లేదంటే ఏడాది.. మహా అయితే రెండేళ్లు మాత్రమేనన్నాడు. ఈ విషయాన్ని తన మెదడు తనకు నిత్యం చెబుతోందని నిరుత్సాహంతో మాట్లాడిన ఇర్ఫాన్..ఇక ఇలాంటి మాటలు మాట్లాడబోనన్నాడు..కనీసం బతికున్న రోజులు హ్యాపీగా గడాలనుకుంటున్నానని పేర్కొన్నాడు.

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ ( న్యూరో ఎండోక్రిన్ కార్సినోమా) వ్యాధిత బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లండన్ లో ఆయన చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం తనకు కీమో థెరపీ నాలుగు సైకిల్స్ పూర్తయ్యాయి.. ఇంకా రెండు సైకిల్స్ పూర్తి కావాల్సి ఉంది. తనకు మొత్తం ఆరు సైకిల్స్ పూర్తయ్యాక పెట్ స్కాన్ చేయాల్సి ఉంటుందని..ఆ తర్వాత ఏం చేయాలనేది తెలుస్తుందని ఇర్ఫాన్ ఖాన్ వైద్యులు పేర్కొన్నారు.
 

Trending News