తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిపాలైన ప్రముఖ నటుడు

బాలీవుడ్‌లో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందిన ఇర్ఫాన్ ఖాన్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంత కాలంగా పెద్ద ప్రేగుకు ఇన్‌ఫెక్షన్ సోకిన కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇర్ఫాన్ ఖాన్ ఉన్నట్టుండి మంగళవారం అస్వస్థతకు గురవడంతో కుటుంసభ్యులు ఆయన్ను ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌కి తరలించారు.

Last Updated : Apr 29, 2020, 12:01 AM IST
తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిపాలైన ప్రముఖ నటుడు

ముంబై: బాలీవుడ్‌లో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందిన ఇర్ఫాన్ ఖాన్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంత కాలంగా పెద్ద ప్రేగుకు ఇన్‌ఫెక్షన్ సోకిన కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇర్ఫాన్ ఖాన్ ఉన్నట్టుండి మంగళవారం అస్వస్థతకు గురవడంతో కుటుంసభ్యులు ఆయన్ను ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌కి తరలించారు. 

Also read: COVID-19 cases in Telangana: తెలంగాణలో తగ్గిన కరోనా వైరస్ వ్యాప్తి

ఇర్ఫాన్ ఖాన్ ఆస్పత్రి పాలవడంపై ఆయన పీఆర్వో మీడియాతో మాట్లాడుతూ.. అవును ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన మాట నిజమేనని, ప్రస్తుతం ఆయన నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణలో ఐసియూలో చికిత్స పొందుతున్నారని అన్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం పరిస్థితిపై వివరాలు వెల్లడిస్తామని.. వదంతులు నమ్మొద్దని ఇర్ఫాన్ ఖాన్ పీఆర్వో తెలిపారు. మహేష్ బాబు హీరోగా వచ్చిన సైనికుడు సినిమాలో విలన్ పాత్ర పోషించడం ద్వారా బాలీవుడ్ నుంచి ఆయన తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయినప్పటికీ.. ఆ తర్వాత మళ్లీ మొత్తం బాలీవుడ్ సినిమాల్లోనే నటించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News