బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న జగపతిబాబు!

హీరోగా నటించి మెప్పించిన జగపతి బాబు.. ప్రస్తుతం దక్షిణాది భారీ బడ్జెట్ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు కమ్ విలన్ గా నటిస్తున్నాడు.

Last Updated : Apr 15, 2018, 05:32 PM IST
బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న జగపతిబాబు!

హీరోగా నటించి మెప్పించిన జగపతి బాబు.. ప్రస్తుతం దక్షిణాది భారీ బడ్జెట్ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు కమ్ విలన్‌గా నటిస్తున్నాడు. తెలుగులోనే కాకుండా జగపతి బాబు తమిళ్, మలయాళం మరియు కన్నడ చలన చిత్ర పరిశ్రమలలో కూడా ప్రసిద్ధి చెందారు.

త్వరలోనే జగ్గూభాయ్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ దబాంగ్ 3లో జగపతి బాబు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు మూవీలు రాగా, ఇప్పుడు మూడో మూవీకి రంగం సిద్ధమైంది. ఈ మూవీకి ప్రభుదేవా ద‌ర్శక‌త్వం వ‌హించ‌నున్నాడు. తన తొలి బాలీవుడ్ చిత్రంలో జగ్గుభాయ్.. సల్లూ భాయ్ సరసన విల‌న్‌గా నటించనున్నాడు.  రంగ‌స్థలంలో జ‌గ‌ప‌తిబాబు న‌టించిన ప్రెసిడెంట్ పాత్రను చూసిన స‌ల్మాన్ త‌న మూవీలో జ‌గ‌ప‌తిబాబు పేరును సూచించిన‌ట్లు స‌మాచారం. అలాగే ప్రభుదేవాతో కూడా జ‌గ‌ప‌తిబాబుకి సన్నిహిత సంబంధాలే ఉండటంతో ద‌బాంగ్ 3 తో జ‌గ్గుబాయి బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు.

దబాంగ్ 3 ఏప్రిల్ చివర్లో షూటింగ్ ప్రారంభిస్తుంది. ఈ చిత్రం ఏడాది చివర్లో విడుదల కావచ్చు. సోనాక్షి సిన్హా, అర్బాజ్ ఖాన్ పాత్రలు మళ్లీ పునరావృతం కానున్నాయి. మొత్తానికి బాలీవుడ్‌లో అడుగు పెట్టాల‌నే జ‌గ‌ప‌తిబాబు క‌ల ఈ విధంగా నెర‌వేర‌నుంది.

Trending News