గోల్డ్ జువెలరీ బిజినెస్‌లోకి కాజల్ అగర్వాల్ ?

గోల్డ్ జువెలరీ బిజినెస్ ప్రారంభించిన కాజల్

Last Updated : Jul 9, 2019, 12:36 PM IST
గోల్డ్ జువెలరీ బిజినెస్‌లోకి కాజల్ అగర్వాల్ ?

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది సినీ పరిశ్రమకు చెందిన వారికి సరిగ్గా సూట్ అవుతుందనే లైన్ మనం ఇవాళ కొత్తగా వింటున్నది కాదు.. అవును, అది టాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా.. శాండల్‌వుడ్ అయినా బాలీవుడ్ అయినా.. ఓవైపు సినిమాలు చేస్తూనే వచ్చిన ఆదాయాన్ని వ్యాపారంవైపు మళ్లించడం అనేది సినిమా వాళ్లకు ఉన్న అలవాటుగా చెబుతుంటారు. అందుకు నిదర్శనంగానే చాలామంది సినిమా వాళ్లు హోటల్, రియల్ ఎస్టేట్, స్టూడియోస్, థియేటర్స్ బిజినెస్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెడుతుండటం ఓ నిదర్శనం. తాజాగా కాజల్ అగర్వాల్ కూడా ముంబైలో గోల్డ్ జువెలరీ బిజినెస్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. 

ఇప్పటికే KA వెంచర్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించిన కాజల్ అగర్వాల్.. త్వరలోనే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇదిలావుండగా ఇప్పుడు గోల్డ్ బిజినెస్‌లో అడుగుపెట్టిందట ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ.

Trending News