మెగాస్టార్ ది లెజెండ్ పుస్తాకావిష్కరణ

తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా దక్షిణాదిగా తనకంటూ బ్రాండ్ ఇమేజ్ సాధించిన అగ్ర కథానాయకుడు కొణిదెల చిరంజీవి. స్వయంకృషితో (సెల్ఫ్ మేడ్) వారసత్వ అండ లేకుండా స్వయంప్రతిభతో ఎదిగిన చిరంజీవిని అభిమానులు మెగాస్టార్ గా

Last Updated : Mar 1, 2020, 10:26 PM IST
మెగాస్టార్ ది లెజెండ్ పుస్తాకావిష్కరణ

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా దక్షిణాదిగా తనకంటూ బ్రాండ్ ఇమేజ్ సాధించిన అగ్ర కథానాయకుడు కొణిదెల చిరంజీవి. స్వయంకృషితో (సెల్ఫ్ మేడ్) వారసత్వ అండ లేకుండా స్వయంప్రతిభతో ఎదిగిన చిరంజీవిని అభిమానులు మెగాస్టార్ గా తమ హృదయాల్లో నిలుపుకున్నారు. తాజాగా ఆయన జీవితచరిత్రతో సినీ పాత్రికేయుడు వినాయకరావు 'మెగాస్టార్ ది లెజెండ్' అనే పుస్తకం రాశారు. 

ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి తనయుడైన హీరో రామ్ చరణ్ ప్రత్యేకమైన గెటప్ ఆకర్షణగా నిలిచాడు. మరోవైపు అల్లు అరవింద్, మురళీమోహన్, కె.రాఘవేంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందని తెలిపారు. 
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News