హీరో 'కళ్యాణ్ రామ్' ఫేస్ బుక్ లైవ్ @3PM

నంద‌మూరి హీరో కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన సినిమా ఎమ్మెల్యే – ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’.

Last Updated : Mar 21, 2018, 09:27 AM IST
హీరో 'కళ్యాణ్ రామ్' ఫేస్ బుక్ లైవ్ @3PM

నంద‌మూరి హీరో కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన సినిమా ఎమ్మెల్యే – ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’. ఈ మూవీ ఈ నెల 23వ తేదిన విడుద‌లై ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో బుధవారం  మధ్యాహ్నం మూడు గంటలకు ఫేస్ బుక్ లో తన అభిమానులతో హీరో కళ్యాణ్ రామ్ లైవ్ ఛాట్ చేయనున్నారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తారు.

ఎమ్మెల్యే మూవీ ప్రీ రిలీజ్ వేడుక..

నంద‌మూరి హీరో కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన సినిమా 'ఎమ్మెల్యే'. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలు మంగళవారం రాత్రి 7 గంట‌ల‌కు అట్టహాసంగా జరిగాయి. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ పొలిటీషియన్ గా కనిపించనున్నారు. టి.జి.విశ్వప్రసాద్‌ సమర్పణలో బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భరత్ చౌదరి, కిరణ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్, కాజల్‌తో పాటు రవి కిష‌న్‌, పోసాని, జయప్రకాశ్ రెడ్డి, అజయ్, వెన్నెల కిశోర్, పృథ్వి, శివాజీ రాజా, ప్రభాస్ శ్రీను, లాస్యా, మనాలి రాథోడ్ తదితరులు ప్రధాన తారాగ‌ణంగా న‌టించారు.

Trending News