1134 Movie: నో బడ్జెట్‌తో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ '1134'.. ఈ నెల 5న ఆడియన్స్ ముందుకు..

1134 Movie Release Date: సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన 1134 మూవీని ఈ నెల 5వ తేదీన విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. రాబరీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా తప్పకుండా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ థియేటర్స్‌లో తమ సినిమా చూడాలని కోరారు.    

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2024, 06:14 PM IST
1134 Movie: నో బడ్జెట్‌తో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ '1134'.. ఈ నెల 5న ఆడియన్స్ ముందుకు..

1134 Movie Release Date: కొత్త కాన్సెప్ట్‌తో రూపొందించిన సినిమాలకు ఆడియన్స్‌ నుంచి ఎప్పుడు మంచి రెస్పాన్స్ ఉంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌లను తెరపై చక్కగా చూపిస్తే.. కచ్చితంగా సూపర్ హిట్ చేస్తున్నారు. ఇలాంటి ఓ ప్రయోగత్మాక మూవీని తెరకెక్కిస్తున్నా డైరెక్టర్ శరత్ చంద్ర. ‘1134’ అనే టైటిల్‌తో రూపొందించిన ఈ మూవీలో కృష్ణ మడుపు, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, ఫణి భార్గవ్, నర్సింగ్ వాడేకర్ కీలక పాత్రల్లో నటించారు. థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను  శాన్వీ మీడియా బ్యానర్‌పై రూపొందించిన ఈ మూవీకి భరత్ కుమార్ పాలకుర్తి సహ నిర్మాతగా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న నో బడ్జెట్‌ చిత్రాన్ని జనవరి 5వ తేదీన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ముందుగా డిసెంబర్ 15న విడుదల చేయాలని ప్లాన్ చేసినా.. వాయిదా పడింది. జనవరి 5న ఆడియన్స్ ముందుకు గ్రాండ్‌గా తీసుకువస్తున్నట్లు తెలిపారు.

రాబరీ బ్యాక్‌డ్రాప్‌లో బలమైన కథా, కథనంతో నో బడ్జెట్ మూవీ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి. సెన్సార్ నుంచి ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చింది. జనవరి 5న ఆడియన్స్ థియేటర్లలో తమ సినిమాను చూసి ఆదరించాలని మేకర్స్ కోరారు. శ్రీ మురళీ కార్తికేయ మ్యూజిక్ అందించగా.. నజీబ్ షేక్, జితేందర్ తలకంటి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.  

==> నటీనటులు: కృష్ణ మడుపు, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, ఫణి భార్గవ్, నర్సింగ్ వాడేకర్
==> డైరెక్టర్: శరత్ చంద్ర తడిమేటి
==> బ్యానర్: రాంధుని క్రియేషన్స్, శాన్వీ మీడియా
==> సహ నిర్మాత : భరత్ కుమార్ పాలకుర్తి
==> మ్యూజిక్: శ్రీ మురళీ కార్తికేయ
==> DOP: నజీబ్ షేక్, జితేందర్ తలకంటి
==> DI: గజ్జల రక్షిత్ కుమార్ 

Also Read: Redmi Note 13 Pro 5G: Redmi Note 13 సిరీస్‌ మొబైల్స్‌ల ధరేంతో తెలుసా? లీక్‌ అయిన ధర, ఫీచర్స్‌ వివరాలు! 

Also Read: Petrol And Oil Tankers: వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్‌, ఆయిల్‌ ట్యాంకర్ల సమ్మె విరమణ   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News