పవన్ సతీమణి అన్నా లెజ్నెవా కథ ఇదే..!

అన్నా లెజ్నెవా రష్యన్ పౌరురాలు. 'తీన్మార్' చిత్ర షూటింగ్ లో పవన్ కళ్యాణ్ ఆమెను కలుసుకున్నాడు. ఈ చిత్రంలో పవన్ హీరోగా నటించగా..అన్నా చిన్న పాత్ర పోషించింది. 

Last Updated : Jan 27, 2018, 02:02 PM IST
పవన్ సతీమణి అన్నా లెజ్నెవా కథ ఇదే..!

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా రష్యన్ పౌరురాలు అన్న విషయం మనకు తెలిసిందే. 'తీన్మార్' చిత్ర షూటింగ్‌లో తొలిసారిగా పవన్ కళ్యాణ్ ఆమెను కలుసుకోవడం జరిగింది. ఈ చిత్రంలో పవన్ హీరోగా నటించగా..అన్నా చిన్న పాత్రలో నటించింది. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని సమాచారం. కొన్నాళ్లు వీరిద్దరూ డేటింగ్ చేసినా.. పవన్ తన రెండో భార్య రేణు దేశాయ్‌కు అప్పటికి అధికారికంగా విడాకులు ఇవ్వలేదు కనుక వీరి వివాహం గురించి బయటి ప్రపంచానికి తెలియలేదని కొన్ని పత్రికలు తెలపడం గమానార్హం.  

పవన్ మూడో వివాహం చేసుకొనే సమయానికే అతనికీ, రేణుదేశాయ్‌లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. విడాకుల తరువాత రేణుదేశాయ్ పుణెకు వెళ్ళిపోయారు. సెలవులు వస్తే పవన్‌ను చూడడానికి పిల్లలు వచ్చేవారు లేదా వారిని చూడటానికి పవన్ కళ్యాణ్  వెళ్ళేవారు.
 
ఎప్పుడైతే పవన్ మూడో పెళ్లి వార్త బయటకు వచ్చిందో.. పవన్ కళ్యాణ్ పై మీడియా ఫోకస్ పెట్టింది. కొన్ని మీడియా వార్తలు ఆయన తీన్మార్ కో-స్టార్ డానా మార్క్స్‌ను వివాహం చేసుకున్నాడని పేర్కొన్నాయి. ఈ వార్తను నిజం చేకూర్చేలా ఆడియో లాంచ్‌‌లో ఆమె పవన్ పక్కనే ఉన్న సీటులో కూర్చున్న చిత్రాలను ప్రచురించాయి. ఆ సమయంలో కూడా పవన్ తన మూడవ వివాహం, అన్నా లెజ్నవాతో సంబంధంపై పెదవివిప్పలేదు.  

కానీ ఆ తరువాత పరిస్థితులు మారాయి. అన్నా, పవన్‌తో కలిసి జీవించడం ప్రారంభించారు. ఆమె సాధారణ కాటన్ చీరలు ధరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పవన్  దగ్గరి కుటుంబ సభ్యులు,  ఇంట్లో పనివాళ్ళు తప్ప ఆమె ఎవరో బయటి ప్రపంచానికి  తెలీలేదు. పవన్-అన్నా చాలాసార్లు డిన్నర్ చేయడానికి బయటికి వెళ్లారు. కానీ ఇద్దరూ పబ్లిక్‌గా ఏ ఈవెంట్‌లకు హాజరుకాలేదు. ఆ తర్వాత అన్నాను పవన్ తల్లివద్దకు తీసుకెళ్లాడు. నాగబాబు కుటుంబానికి కూడా పరిచయం చేశాడు. కానీ అన్నా ఎప్పుడూ చిరంజీవిని కలవలేదని కూడా వార్తలొచ్చాయి. అవి ఎంతవరకు నిజమో తెలీదు. పవన్ ఈ మధ్య అన్నాను బయటి ప్రపంచానికి పరిచయం చేశాడు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహంలో కూడా అన్నా పాలుపంచుకోంది. అలాగే గతవారం  పవన్‌తో పాటు కలిసి చర్చిలో ప్రార్థనలు చేసింది. పవన్ జనసేన తరఫున ప్రజాయాత్ర మొదలుపెట్టినప్పుడు తెలుగు సంప్రదాయం ప్రకారం హారతి ఇచ్చి భర్త పవన్ నుదుట బొట్టు పెట్టింది. అన్నా లెజ్నెవాకు సౌమ్యురాలిగా కూడా పేరుంది. 

పవన్ కళ్యాణ్-అన్నా లెజ్నెవాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు పేరు పోలేనా అయితే,  కొడుకు పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. తన అన్న చిరంజీవి గుర్తుగా తన కొడుకుకి శంకర్ అని పేరు పెట్టాడని కొందరు అంటూ ఉంటారు. ఎందుకంటే చిరంజీవి అసలు పేరు.. శివ శంకర్ వరప్రసాద్.

Trending News