Perfume Movie: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో 'పర్‌ఫ్యూమ్'.. ఆడియన్స్ పెద్ద హిట్ చేయాలి: చంద్రబోస్

Perfume Movie Pre Release Event: పర్‌ఫ్యూమ్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో ఆస్కార్ విన్నర్ చంద్రబోస్‌ను మూవీ సత్కరించింది. ఈ సినిమా నవంబర్ 24న ఆడియన్స్ ముందుకు రానుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2023, 06:29 PM IST
Perfume Movie: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో 'పర్‌ఫ్యూమ్'.. ఆడియన్స్ పెద్ద హిట్ చేయాలి: చంద్రబోస్

Perfume Movie Pre Release Event: స్మెల్ బేస్డ్ థ్రిల్లింగ్ అనే సరికొత్త కాన్సెప్ట్‌‌తో రూపొందిన మూవీ ‘పర్‌ఫ్యూమ్’. చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించిన ఈ సినిమాకు జేడీ స్వామి దర్శకత్వం వహించారు. శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ బ్యానర్స్‌పై జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా)లు సంయుక్తంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను నవంబర్ 24న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నారు మూవీ మేకర్స్. గురువారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించగా.. ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్‌ను చిత్రబృందం సత్కరించింది. 

ఈ సందర్బంగా హీరో చేనాగ్ మాట్లాడుతూ.. స్మెల్లింగ్ అబ్‌సెషన్‌తో ఇలాంటి స్టోరీ ఇండియన్ స్క్రీన్ మీద చూడలేదని చెప్పారు. ప్రొడ్యూసర్స్ తనను ముందుకు నడిపించారని.. చంద్రబోస్ ఎంతో సపోర్ట్ చేశారని అన్నారు. ఈ సినిమాలో ఎన్నో లేయర్స్ ఉన్నాయని.. డార్క్ మోడ్‌లో తన పాత్ర ఉంటుందని తెలిపాడు. తనకు మళ్లీ ఇలాంటి ఒక మంచి పాత్ర దొరకదని.. ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన దర్శకుడికి థ్యాంక్స్ చెప్పారు. 

ఆస్కార్ అవార్డు విజేత చంద్రబోస్ మాట్లాడుతూ.. తాను ఇప్పటివరకు మొత్తం 3700 పాటలు రాశానని.. ఈ రోజు తన గురించి తన మీద పాట రాసి పాడారని అన్నారు. తనకు గిఫ్ట్‌గా ఆ పాటను ఇచ్చిన మూవీ టీమ్‌కు థ్యాంక్స్ చెప్పారు. ఆస్కార్ అందుకున్న ఆ మూమెంట్‌ను మళ్లీ చూసి ఎమోషనల్‌గా అనిపించిందన్నారు. ఈ చిత్రాన్ని జేడీ అద్భుతంగా డిజైన్ చేశారని.. తాను రాసిన పాటకు అజయ్ చక్కటి మ్యూజిక్ అందించారని అభినందించారు. ఈ సినిమా దర్శక నిర్మాతలకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రేక్షకులు ఆదరించి పెద్ద విజయాన్ని అందించాలని కోరారు. నటుడు, డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. తాను చేసిన సినిమాకు నగేష్ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారని గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా పెద్ద హిట్టవ్వాలని కోరుకున్నారు.  

కొత్తదనం, కొత్త పాయింట్‌తో మూవీ చేస్తే కచ్చితంగా మంచి ప్రతిఫలం వస్తుందని డైరెక్టర్ జేడీ స్వామి అన్నారు. తన గురువు చంద్రబోస్ తనకు స్ఫూర్తి అని చెప్పారు. తమ సినిమాను ప్రేక్షకులు అందరూ థియేటర్లో చూసి ఆశీర్వదించాలని కోరారు. మూవీ టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరిలియో. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ప్రాచీ థాకర్,  సంగీత దర్శకుడు అజయ్, కెమెరామెన్ మహేష్ మాట్లాడారు. సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం ఉందన్నారు.  

Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే

Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News