ఘనంగా జరిగిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ముని మనవరాలి వివాహాం

తెలుగునాట స్వాతంత్ర్య సంగ్రామానికి నాంది పలికిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సినిమా వస్తున్న సంగతి మనకు తెలిసిందే. 

Last Updated : Aug 22, 2018, 01:48 PM IST
ఘనంగా జరిగిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ముని మనవరాలి వివాహాం

తెలుగునాట స్వాతంత్ర్య సంగ్రామానికి నాంది పలికిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సినిమా వస్తున్న సంగతి మనకు తెలిసిందే. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాయలసీమకు చెందిన గొప్ప యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు ఇప్పుడు ఊరూ వాడా కోడై కూస్తోంది. ఆయన లేదా ఆయన కుటుంబానికి సంబంధించిన ఏ విషయం గురించి తెలిసినా.. మీడియాలో అది ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ముని మనుమరాలు సంజనరెడ్డి వివాహం హైదరాబాద్‌లో జరగడంతో ఆ వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది.

ఈ వివాహానికి పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారని వినికిడి. ఈ వివాహం సందర్భంగా సంజనరెడ్డి తల్లిదండ్రులు పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా వారు పంచుకోవడం జరిగింది. మెగాస్టార్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించడం తమకు ఆనందంగా ఉందని వారు అన్నారు. 

గతంలో తామే స్వయంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథను సినిమాగా తీయాలని భావించామని.. కాని కుదరలేదని ఆయన కుటుంబానికి చెందిన వ్యక్తులు తెలిపారు. సుమన్, సాయికుమార్ మొదలైన హీరోలను ఈ సినిమాలో నటించే విషయమై సంప్రదించామని కూడా అన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు మీద త్వరలోనే మెమోరియల్ హాల్ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఇప్పుడు వెండితెర ప్రేక్షకుల కోసం సినిమాగా రావడం తమకు సంతోషంగా ఉందని వారు తెలిపారు. 

Trending News