అప్సరా రాణిగా పేరు మార్చి RGV థ్రిల్లర్ ఛాన్స్!

ఒడిశా బ్యూటీ అప్సరా రాణి (Apsara Rani) ఎవరు.. అసలు ఆమె పూర్తి పేరు వివరాలపై నెటిజన్లు గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ.. ఆ హీరోయిన్‌కు అవకాశం ఇస్తానని మాటివ్వడం ప్రస్తుతం అప్సరా రాణిగా పేరు మార్చి థ్రిల్లర్ సినిమాకి తీసుకోవడం తెలిసిందే.

Last Updated : Jul 9, 2020, 01:04 PM IST
అప్సరా రాణిగా పేరు మార్చి RGV థ్రిల్లర్ ఛాన్స్!

లాక్‌డౌన్ వేళ సినిమాలు తీసేందుకు ఇతర డైరెక్టర్లు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు వివాదాలకే కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) వరుస సినిమాలు చేస్తున్నాడు. ముందుగా పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో క్లైమాక్స్ (Climax), ఆపై తెలుగమ్మాయి శ్రీ రాపాకతో హాట్ మూవీ నగ్నం (Naked Movie)ని తెరకెక్కించిన వర్మ తాజాగా థ్రిల్లర్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. థ్రిల్లర్ సినిమాలో హీరోయిన్ అప్సరా రాణి (Apsara Rani) అని పరిచయం చేస్తూనే మరో అడుగు ముందుకేసి ఏకంగా ఫొటోషూట్ ఫొటోల (Apsara Rani Hot Photos)ను నెటిజన్లకు అందించాడు డైరెక్టర్ వర్మ. RGV కంపెనీ నుంచి మరో హాట్ బాంబ్ అప్సర రాణి

ఇక అది మొదలుకుని అందరూ అప్సరా రాణి ఎవరని గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలను షేక్ చేస్తున్నాయి. అయితే వర్మ చెప్పినట్లుగా ఆమెది ఒడిశానే. అయితే ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ అమె పెరిగిందని, అయినా సరే ఒడిశా నుంచి వచ్చిన తుఫాన్ అని ఆమె అందాన్ని ఆకాశానికెత్తేశారు. అయితే వర్మ చేసిన సినిమా స్టంట్ అందరూ పసిగట్టేస్తున్నారు. థ్రిల్లర్ సినిమా హీరోయిన్ అప్సరా రాణిని ఎక్కడి చూసినట్టుందే అని టాలీవుడ్ ప్రేక్షకులు గుర్తు పట్టేశారు.  RGV సెక్సీ హీరోయిన్ Apsara Rani హాట్ ఫొటోలు వైరల్ 

టాలీవుడ్ హీరోయిన్ అంకితా మహారాణా
24ఏళ్ల ఒడిశా అందం పేరు వర్మ చెప్పినట్లుగా అప్సరా రాణి కాదు, ఆమె అసలు పేరు అంకితా మహారాణా (Anketa Maharana). శ్రీ రాపాకను నగ్నంలో స్వీటీగా ఎలా మార్చారో, ఇప్పుడు ఒడిశా బ్యూటీని అప్సరా రాణిగా చేశాడు వర్మ. అయితే ఆమె తెలుగులో 4 లెటర్స్, ఉల్లాల ఉల్లాల సినిమాలు చేసింది. హాట్ హాట్ బికినీ సీన్లు, లిప్ లాక్‌లతో రచ్చరచ్చ చేసింది. 

తన సినిమాలకు కావాల్సినంత అందం, హాట్ సీన్లలో ఏ జంకు లేకుండా నటిస్తుందని భావించిన వర్మ తన థ్రిల్లర్ మూవీకి అంకితా మహారాణాను సెలక్ట్ చేశాడని టాక్. అప్సరా రాణిగా పేరు మారిస్తే కొత్తదనం కనిపిస్తుందని, అప్సరలా ఉందంటూ క్రేజ్ వస్తుందని రామ్ గోపాల్ వర్మ తన హీరోయిన్ స్క్రీన్ నేమ్‌ను అప్సరా రాణిగా మార్చేశారు. తన సినిమా ఆడియో లాంచ్‌ వర్మ చేతుల మీదుగా జరిగిన సమయంలోనే సినిమా ఛాన్స్ గురించి డిస్కషన్ చేశారట. తాజాగా షెడ్యూల్ కుదరడంతో వర్మ, అప్సరా రాణి థ్రిల్లర్ మూవీ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos

Trending News