Side effects of COVID vaccine in women: మహిళలకే కొవిడ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువా ? ఎందుకు ?

Why women more prone to side effects of COVID vaccine : మహిళలకే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తాయా ? ఒక వేళ అదే నిజమైతే అలా ఎందుకు జరుగుతుంది ? ఈ వాదనలపై వైద్య నిపుణులు, అధ్యయనాలు ఏం చెబుతున్నాయనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 8, 2021, 03:44 PM IST
  • కొవిడ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రత స్థాయి పురుషుల్లో ఒకలా, మహిళల్లో మరోలా ఉంటుందా ?
  • మహిళల్లోనే కొవిడ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయా ?
  • అసలు వ్యాక్సిన్ తీసుకున్నాక సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి కారణం ఏంటి ?
Side effects of COVID vaccine in women: మహిళలకే కొవిడ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువా ? ఎందుకు ?

Why women more prone to side effects of COVID vaccine: కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నాకా కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అలా ఆందోళన చెందేవాళ్లు గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఎలాంటి వ్యాక్సిన్ తీసుకున్నా, ఆ వ్యాక్సిన్ శరీరంలోకి ప్రవేశించాకా ఒంట్లో ఉండే వ్యాధి నిరోధక శక్తి పునరుత్తేజితమై యాంటీబాడీలు (antibodies) ఉత్పత్తి చెందడమేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడైతే ఇమ్యునిటీ సిస్టం యాక్టివ్ అవుతుందో.. అప్పుడే శరీరంలోకి ప్రవేశించిన వ్యాధితో పోరాడేందుకు అవసరమైన యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని, దాని ఫలితంగానే కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్స్ (Side effects) కలిగే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Women more prone to side effects ?: మహిళలకే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తాయా ?
సైడ్ ఎఫెక్ట్స్ రావడంలో మహిళలు, పురుషులు అనే తేడా ఏమీ ఉండనప్పటికీ.. కరోనావైరస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనంతరం మహిళల నుంచే ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 

Why women are more prone to side effects ?: మహిళలకే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా రావడానికి కారణం ఏంటి ?
ముందుగా చెప్పుకున్నట్టుగా సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి కారణం శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ యాక్టివ్ కావడమే. అయితే, పురుషులతో పోల్చితే.. స్త్రీలలో ఇమ్యునిటీ సిస్టం (Immunity system) ఎంతో ఆరోగ్యంగా, మెరుగ్గా పని చేస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఆ విధంగా చూసుకున్నట్టయితే.. రోగ నిరోధక వ్యవస్థ ఎవరిలోనైతే ఎక్కువ బాగా పనిచేస్తుందో.. వారి ఒంట్లో యాంటీబాడీలు కూడా అదే స్థాయిలో ఉత్పత్తి చెంది వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతే ఎక్కువగా కనిపించే అవకాశాలున్నాయి. 

Also read : COVID booster shot: కోవిడ్ బూస్టర్ షాట్‌ వ్యాక్సిన్ అంటే ఏంటి? ఎవరు తీసుకోవాలి ?

అందుకే అధిక శాతం మహిళల్లో ఇమ్యునిటీ సిస్టం మెరుగ్గా పనిచేస్తుండటం వల్లే వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపించడానికి ఓ కారణమై ఉండొచ్చని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం జరిపిన పలు సర్వేలు కూడా ఇదే అంశాన్ని స్పష్టంచేస్తున్నాయి.

Sex may be a determining factor too: స్త్రీలలో సున్నితత్వం కూడా ఓ కారణమా ?
సహజంగానే పురుషులతో పోలిస్తే.. స్త్రీలలో ఏదైనా అనారోగ్య సమస్యను తట్టుకునే గుణం తక్కువగా ఉంటుందనే భావన ఉంది. ఆ భావన వల్లే మహిళల నుంచి సైడ్ ఎఫెక్ట్స్ (Side Effects) కంప్లెయింట్స్ ఎక్కువగా ఉండొచ్చునేమో అనేవాళ్లు కూడా లేకపోలేదు. అయితే, ఇది కేవలం ఓ భావన మాత్రమే కానీ శాస్త్రీయం కాదు అనే విషయాన్ని గ్రహించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు మానసికంగా మహిళలే ఎక్కువ ధృడంగా ఉంటారనే భావన కూడా ఉంది.

Also read : How to know COVID-19 vaccine is original or not : కరోనా వ్యాక్సిన్ అసలైనదా, నకిలీదా అనేది ఎలా గుర్తించడం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News