COVID-19 Vaccine: డెల్టా వేరియంట్‌పై Johnson and Johnson సింగిల్ డోసు టీకా ప్రభావం, 8 నెలలపాటు సేఫ్

Johnson and Johnson COVID-19 vaccine: ఓ లాబోరేటరీలో జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దక్షిణాఫ్రికాలో గుర్తించిన బీటా (B.1.351) వేరియంట్‌ కంటే డెల్టా కోవిడ్19 వేరియంట్‌పై మరింత ప్రభావం చూపుతుందని తేలడం గమనార్హం. వేగంగా కరోనాను వ్యాప్తి చేసే డెల్టా వేరియంట్‌ను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తుందని గుర్తించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 2, 2021, 01:34 PM IST
COVID-19 Vaccine: డెల్టా వేరియంట్‌పై Johnson and Johnson సింగిల్ డోసు టీకా ప్రభావం, 8 నెలలపాటు సేఫ్

Johnson and Johnson COVID-19 vaccine: ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్‌లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమైన వేరియంట్‌పై తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అతి వేగంగా కరోనా మహమ్మారిని వ్యాప్తి చేస్తే డేల్టా వేరియంట్‌పై జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్ ఒక్క డోసు సమర్థవంతంగా పనిచేస్తుందని గుర్తించారు.

ఓ లాబోరేటరీలో జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. జాన్సన్ అండ్ జాన్సన్ ఒక్క డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే అతి వేగంగా కరోనాను వ్యాప్తి చేసే డెల్టా వేరియంట్‌ను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తుందని గుర్తించారు. ఆ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి మెరుగవుతుందని, వ్యాక్సిన్ ప్రభావం దాదాపు 8 నెలలపాటు ఉంటుందని పేర్కొన్నారు. SARS-CoV-2 వేరియంట్లపై జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది. యాంటీ బాడీలు త్వరగా ఉత్పత్తి చేసి డెల్టా వేరియంట్‌ (Delta Variant of Covid-19)ను నిర్వీర్యం చేస్తుందని రిపోర్టులో వెల్లడించారు. 

 Also Read: India Covid-19 Death Toll: ఇండియాలో 4 లక్షలు దాటిన కోవిడ్19 మరణాలు

దక్షిణాఫ్రికాలో గుర్తించిన బీటా (B.1.351) వేరియంట్‌ కంటే డెల్టా కోవిడ్19 వేరియంట్‌పై మరింత ప్రభావం చూపుతుందని తేలడం గమనార్హం. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా తీసుకున్నవారిలో 85 శాతం మందిలో ప్రాణాంతకంగా మారకుండా ప్రభావం చూపింది. తమ వ్యాక్సిన్ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో మెరుగైన ఫలితాలు రాబట్టిందని జాన్సన్ అండ్ జాన్సన్ ఎండీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ పాల్ స్టాఫెల్స్ తెలిపారు. డెల్టా వేరియంట్‌ను నిర్వీర్యం చేయడంతో పాటు యాంటీబాడీలు త్వరగా ఉత్పత్తి చేసి కరోనా వైరస్‌ను కట్టడి చేస్తుందన్నారు. క్లినికల్ డేటా సమాచారం మేరకే సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ ప్రభావంపై ఓ అంచనాకు వచ్చినట్లు పేర్కొన్నారు.

Also Read: UAE Travel Ban: భారత్‌కు ప్రయాణాలు నిషేధిస్తూ పౌరులపై యూఏఈ కఠిన Covid-19 ఆంక్షలు

జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ 8 నెలలపాటు కచ్చితంగా రక్షణ కల్పిస్తుందని, శాస్త్రీయంగా ఆధారాలున్నాయని చెప్పారు. రోగనిరోధక శక్తిని త్వరగా పెంపొందించి డెల్టాతో పాటు మరికొన్ని కరోనా వేరియంట్లపై భారీ స్థాయిలో ప్రభావం చూపిందన్నారు. ఈ సింగిల్ డోసు కోవిడ్19 వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగానికిగానూ అమెరికాలో ఫిబ్రవరి 27న ఆమోదం లభించింది. మార్చి 11న యూరోపియన్ కమిషన్ కండీషనల్ మార్కెటింగ్‌కు అనుమతి పొందింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News