ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీళ్ళు తాగితే ముప్పే..!

దాహాన్ని తీర్చుకోవడం కోసం మంచినీళ్ళను బాటిల్స్‌లో స్టోర్ చేసేటప్పుడు ఇక జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

Last Updated : Mar 16, 2018, 04:10 PM IST
ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీళ్ళు తాగితే ముప్పే..!

దాహాన్ని తీర్చుకోవడం కోసం మంచినీళ్ళను బాటిల్స్‌లో స్టోర్ చేసేటప్పుడు ఇక జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీటిని నిల్వ ఉంచేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలి. ఇటీవలి కాలంలో న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఓ ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది.

భారతదేశంతో పాటు అమెరికా, కెన్యా, బ్రెజిల్, ఇండోనేషియా, చైనా దేశాల్లో 11 బ్రాండ్లకు చెందిన 200 కు పైగా ప్లాస్టిక్ బాటిల్స్‌ను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. అందులో సగానికి సగం బాటిల్స్‌లో మోతాదుకు మించి ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నట్లు తేల్చారు. గరిష్టంగా ఒక్కో బాటిల్‌లో 10,000  ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నట్లు తెలిపారు. అలాగే కుళాయి నీళ్లతో పోల్చుకుంటే.. ఈ ప్లాస్టిక్ బాటిల్స్‌లో నిల్లవ ఉండే నీళ్ళ వల్ల  ముప్పు అధికమని తెలిపారు. 

Trending News