COVID-19 Vaccines Side-effects: కరోనావైరస్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నామని అనుకుంటున్న జనానికి కేంద్రం ఓ షాకింగ్ న్యూస్ వెల్లడించింది. కొవిడ్-19 వైరస్ నివారణ కోసం తీసుకున్న కరోనావైరస్ వ్యాక్సిన్స్ తో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని కేంద్రం అంగీకరించింది. పూణెకు చెందిన ఒక వ్యాపారవేత్త దాఖలు చేసిన పిటిషన్ కి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసిఎంఆర్), సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) ఇచ్చిన జవాబులో ఈ వివరాలు వెల్లడించింది. ప్రఫుల్ శార్ద అనే వ్యాపారవేత్త రైటు టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దాఖలు చేసిన పిటిషన్ కి బదులు ఇస్తూ కేంద్రం ఈ జవాబు ఇవ్వడం ప్రస్తుతం చర్చనియాంశమైంది.
ఆస్ట్రాజెనికా, కొవిషీల్డ్, కోవోవాక్స్. కొవాక్సిన్, సుత్నిక్-వి వంటి వ్యాక్సిన్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. కొర్బోవాక్స్, జైకోవ్- డి వంటి వ్యాక్సిన్లను కేంద్రం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్‌పై వివరాలు అందివ్వాల్సిందిగా కోరుతూ ప్రఫుల్ శార్ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్‌తో పాటు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కి సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్నారు. ప్రఫుల్ శార్ద పిటిషన్ కి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ డా లేయన్న సుసన్ జార్జ్, అలాగే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ డా సుశాంత సర్కార్ స్పందిస్తూ ఆయా వ్యాక్సిన్స్ కి సంబంధించిన ఫ్రీక్వెంట్లీ ఆస్క్ డ్ క్వశ్చన్స్ డేటాను వెల్లడించారు.
కొవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్:
వ్యాక్సిన్ ఇచ్చిన చోట నొప్పిగా ఉండటం, ఎర్రటి బెందులు రావడం, అకారణంగా వాంతులు కావడం, వాంతులతో కానీ లేదా వాంతులు లేకుండా తీవ్రమైన కడుపునొప్పి లేదా తలనొప్పి రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతి నొప్పి, అవయవాల్లో నొప్పి లేదా పాక్షికంగా పక్షవాతం, చలి జ్వరం, కళ్లలో నొప్పి, కళ్లు మసక మసకగా కనపడటం, బలహీనంగా అనిపించడం వంటి లక్షణాలన్నీ కొవీషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ జాబితాలో ఉన్నాయి.
కొవోవాక్స్ సైడ్ ఎఫెక్ట్స్:
కోవోవాక్స్ సైడ్-ఎఫెక్ట్స్ జాబితాలో వ్యాక్సిన్ చేసిన చోట నొప్పిగా అనిపించడం / శరీరం సున్నితంగా మారడం / అలసట, అస్వస్థత, తలనొప్పి, కండరాల నొప్పులు, జ్వరం, కీళ్ల నొప్పులు, వాంతులు లేదా వికారంగా అనిపించడం, చలి జ్వరం, బాడీ పెయిన్స్, బలహీనత, వ్యాక్సిన్ తీసుకున్న చోట దురద, దద్దుర్లు, చర్మం ఎర్రగా మారడం, దద్దుర్లు, వెన్నునొప్పి, మత్తుగా ఉండటం వంటి లక్షణాలు ఉన్నాయని ఐఎఎన్ఎస్ వెల్లడించింది.
కొవాగ్జిన్ సైడ్ ఎఫెక్ట్స్:
కోవాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ విషయంలో ఇంజెక్షన్ చేసిన చోట నొప్పి లేదా వాపు రావడం, తలనొప్పి, అలసట, జ్వరం, బాడీ పెయిన్స్, కడుపు నొప్పి, వికారం లేదా వాంతులు, తల తిరగడం, వణుకుట, చెమటలు పట్టడం, జలుబు దగ్గు వంటి తేలికపాటి లక్షణాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి.
స్పుత్నిక్-వి సైడ్ ఎఫెక్ట్స్:
చలి జ్వరం, ఆర్థ్రాల్జియా, మైయాల్జియా, అస్తెనియా, తలనొప్పి, ఇబ్బందిగా అనిపించడం, ఇంజెక్షన్ చేసిన చోట నొప్పి లేదా వాపు రావడం, వికారంగా అనిపించడం, అజీర్తి సమస్య, ఆకలి లేకపోవటం వంటి సైడ్ ఎఫెక్ట్స్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ జాబితాలో ఉన్నాయి.
కొర్బొఇవాక్స్ సైడ్ ఎఫెక్ట్స్:
కొర్బొఇవాక్స్ వ్యాక్సిన్‌తో జ్వరం, తలనొప్పి, అలసట, బాడీ పెయిన్స్, మైయాల్జియా, వికారం, కీళ్ల నొప్పులు, చలి, బద్ధకం, ఇంజెక్షన్ చేసిన చోట నొప్పిగా అనిపించడం, వాపు, దద్దుర్లు, చికాకు వంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించే అవకాశాలు ఉన్నాయి.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆర్టీఐ యాక్ట్ పిటిషన్ కి ఇచ్చిన సమాధానాలపై ప్రఫుల్ శార్ద స్పందిస్తూ.. "వ్యాక్సినేషన్ పూర్తిగా పౌరుల స్వచ్ఛందానికే వదిలేశాం అని ప్రభుత్వం స్పష్టంగా చెప్పినప్పటికీ.. వ్యాక్సిన్ తీసుకోని వారిని బస్సులు, రైళ్లు, విమానాల్లో ప్రయాణాలు చేయడానికి వీల్లేకుండా నిషేధించడం ద్వారా పరోక్షంగా వారిని ఎందుకు బలవంతం చేశారో అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తంచేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, మల్టీప్లెక్స్‌లు, మాల్ వంటి వాటిలోకి వ్యాక్సిన్ తీసుకోని వారికి అనుమతి లేదని చెప్పడంతో చాలా మంది జనం భయాందోళనకు గురై వాటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలియకుండానే వ్యాక్సిన్స్ తీసుకోవాల్సి వచ్చింది అని ప్రఫుల్ శార్ద ఐఏఎన్ఎస్కి తెలిపారు.