పెరుగు.. ఆరోగ్యానికి మెరుగు

          

Last Updated : Nov 15, 2017, 04:49 PM IST
పెరుగు.. ఆరోగ్యానికి మెరుగు

హాయ్.. ఫ్రెండ్స్ నేను పెరుగుని. ఒకప్పుడు నన్ను తింటే అందరూ బరువు పెరుగుతాం అనేవాళ్లు. కానీ ఇప్పుడు బరువు తగ్గుతాం అంటున్నారు. ఇంతలా నాలో ఏమున్నాయి అనేగా మీ డౌట్? 

ఒకప్పుడు  నన్ను తింటే బరువు పెరుగుతాము అని చాలామంది తినడమే మానేశారు. అది ఒక అపోహ అని వైద్యులు చెప్పడంతో ఇప్పుడు చాలామంది నిర్భయంగా తింటున్నారు. అందుకు కారణం నాలో పుష్కలంగా ఉండే కాల్షియం, అమైనో ఆమ్లాలు. ఇవి మీ రోగాలను నయం చేస్తాయి. డాక్టర్ రాసిచ్చే కొన్ని మందుల కన్నా నేను చాలా పవర్ ఫుల్.

* నేను జీర్ణవ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్‌‌ను అదుపులో ఉంచుతాను.

* డైటరీ ఫ్యాట్‌ను తగ్గిస్తాను. ఆకలిని అదుపులో ఉంచుతాను.

* నాలో ఉన్న కాల్షియం, అమైనో ఆమ్లాలు కొవ్వును తగ్గిస్తాయి. వ్యాధి నిరోధకతను పెంచుతాయి.

* కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాను. ఎముకల్ని గట్టిగా ఉంచుతాను.

* నాలో ఉండే మాంసకృత్తులు, అమైనో ఆమ్లాలు అధికబరువును అదుపులో ఉంచుతాయి. శరీర బరువును తగ్గిస్తుంది.

* చర్మం నిగనిగలాడేందుకు నన్ను వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. చర్మ సౌందర్యంలో, చికిత్సలో నేను ప్రముఖ పాత్ర పోషిస్తా.

* నిద్ర పట్టనివారికి నేనొక ఔషధం. నన్ను తింటే హాయిగా నిద్రపోతారని ఆయుర్వేదంలో కూడా చెప్పారు.

* నన్ను తింటే మీరు ఎప్పుడూ యవ్వనంగా ఉంటారు.

ఇవేకాదు ఫ్రెండ్స్.. నాలో ఇంకెన్నో విశేషాలు ఉన్నాయి. మరోసారి కలుసుకుందాం.. బై బై !

Trending News