How To Lose Over Weight Without Exercises: జిమ్‌కి వెళ్లకుండా, ఎక్సర్‌సైజెస్ చేయకుండా అధిక బరువు తగ్గడం ఎలా ?

How To Lose Over Weight Without Exercises: అధిక బరువు పెరగకుండా ఉండాలంటే కచ్చితంగా జిమ్‌కే వెళ్లాల్సిన పని లేదు. పొట్ట రాకుండా ఉండాలంటే కచ్చితంగా కఠినమైన వ్యాయమాలు చేసి ప్రాణాలపైకి తెచ్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. హెల్తీ లైఫ్ స్టైల్‌తో, హెల్తీ ఫుడ్ తీసుకుంటూ కూడా అధిక బరువు పెరగకుండా నివారించవచ్చు. 

Written by - Pavan | Last Updated : Aug 17, 2023, 05:48 PM IST
How To Lose Over Weight Without Exercises: జిమ్‌కి వెళ్లకుండా, ఎక్సర్‌సైజెస్ చేయకుండా అధిక బరువు తగ్గడం ఎలా ?

How To Lose Over Weight Without Exercises: అధిక బరువు పెరగకుండా ఉండాలంటే కచ్చితంగా జిమ్‌కే వెళ్లాల్సిన పని లేదు. పొట్ట రాకుండా ఉండాలంటే కచ్చితంగా కఠినమైన వ్యాయమాలు చేసి ప్రాణాలపైకి తెచ్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. హెల్తీ లైఫ్ స్టైల్‌తో, హెల్తీ ఫుడ్ తీసుకుంటూ కూడా అధిక బరువు పెరగకుండా నివారించవచ్చు. యస్, ఇట్స్ పాజిబుల్. అరెరె.. ఇదేదో ఇంట్రెస్టింగ్ మ్యాటర్‌లా ఉంది కదా అని అనిపిస్తోంది కదా!! ఔను బ్యాలెన్సింగ్ లైఫ్ స్టైల్ మీ సొంతమైతే.. ఏదైనా సాధించి చూపించవచ్చు. ఇంతకీ అదెలానో తెలుసుకుందామా మరి.

మీరు తినే ఆహారాన్ని పూర్తిగా నిమిలి మింగండి. ఎవరో వెంట పడ్డట్టుగా హడావుడిగా పరుగెడుతున్నట్టు వేగంగా తినకుండా కొంత నెమ్మదిగానే తినండి. ఎందుకంటే మీరు ఆహారం తీసుకుంటున్నారనే సంకేతాలు మీ మెదడుకి చేరుకున్నప్పుడే మీ జీర్ణ ప్రక్రియ కూడా సరిగ్గా జరిగి పొట్ట రాకుండా చేస్తుందని సైన్స్ చెబుతోంది.

తిన్నప్పుడే ఒకేసారి కడుపునిండా కుమ్మేయకుండా.. స్మాల్ స్మాల్ పోర్షన్స్‌లో తినండి. అలా తినడం వల్ల మీకు స్థూలకాయం రాకుండా ఉంటుంది. 

ప్రోటీన్ అధికంగా ఉండే ఫుడ్స్ ఆహారంగా తీసుకోండి. ప్రోటీన్ ఫుడ్స్ తినడం వల్ల మీకు త్వరగా ఆకలి కాకుండా పొట్ట నిండుగా అనిపిస్తుంటుంది. ఒకరకంగా ఇది మీరు ఓవర్ ఈటింగ్ బారిన పడకుండా కాపాడుతుంది. అందుకే అధిక బరువు కూడా పెరిగే అవకాశాలు ఉండవు.
  
హోటల్ ఫుడ్ కాకుండా ఇంట్లో తయారు చేసుకున్న ఆహారం తినడానికే అధిక ప్రాధాన్యత ఇవ్వండి. హోటల్ ఫుడ్స్ లో ఎక్కువగా జంక్ ఫుడ్స్ ఉంటాయి. అవి మీ ఆరోగ్యానికి హాని చేసి అధిక బరువు పెరిగేలా చేస్తాయి. ఇంట్లో వండుకునే ఆహారంలో పోషక విలువలు ఉంటాయి. బయట తినే ఆహారంలో పోషకాలు ఉండకపోగా ఆరోగ్యానికి హాని చేసేవే ఎక్కువగా ఉంటాయి. 

ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోండి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. స్థూలకాయం రాకుండా నివారిస్తుంది.

నీరు ఎక్కువగా తాగే అలవాటు చేసుకోండి. ఒక మనిషి రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. 

కేలరీలు లెక్కించుకునే అలవాటు చేసుకుంటే మీరు ఏం తింటున్నారో, ఎలాంటి ఫుడ్ తింటున్నారో, ఎంత తింటున్నారో అనే స్వీయ విచక్షణ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిగ్గా అధిక బరువు పెరగకుండా మీకు మీరే అలారం లేదా అలర్ట్స్ ఇచ్చుకున్న వాళ్లు అవుతారు. అంతేకాదు.. జంక్ ఫుడ్ తినకుండా మీపై మీకు ఒక స్వీయ క్రమశిక్షణ కూడా ఏర్పడుతుంది. 

రోజూ మిడ్నైట్ వరకు బింగ్ వాచింగ్ లేదా టైమ్ పాస్ చేయకుండా నిద్ర విషయంలో ఒక సమయపాలన పాటించండి. త్వరగా పడుకోవడం, త్వరగా నిద్ర లేవడం అనేది ఒక మంచి అలవాటు. రోజూ 8 గంటల నిద్ర ఉంటే సరిపోతుంది. 

ఇది కూడా చదవండి :  Unhealthy Junk Food Items: మీ ఆరోగ్యం బాగుండాలంటే జీవితంలో ఇవి అసలే తినకండి

ఒత్తిడిని జయించండి. లేదంటే ఒత్తిడి ఎలాంటిదైనా అది మీకు తెలియకుండానే ఎక్కువ తినేలా చేస్తుంది. మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి, పని ఒత్తిడి.. ఇలాంటి సమస్యలన్నీ మిమ్మల్ని అధికబరువు పాలయ్యేలా చేసే వాటిలో ఒకటిగా ఉన్నాయి. అందుకే ఒత్తిడి ఎలాంటిదైనా అందులోంచి బయటికొచ్చేందుకు ప్రయత్నించండి.

షుగర్ అధికంగా ఉంటే బేవరేజెస్ తాగడం మానేయండి. ఎందుకంటే సాఫ్ట్ డ్రింక్స్‌లో అధిక మోతాదులో ఉండే కేలరీలు మిమ్మల్ని అధిక బరువు పెరిగేలా చేస్తుంది.

ఇది కూడా చదవండి : Drinking Water While Eating Food: అన్నం తినే ముందు నీళ్లు తాగితే మంచిదా ? అన్నం తిన్న తరువాత మంచిదా ?

గమనిక: ఇక్కడ పేర్కొన్న వివరాలు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటాయి. వీటిని స్వీకరించానికి ముందు వైద్య సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని ZEE NEWS ధృవీకరించడంలేదు.)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News