Paratha Recipe: ఉదయాన్నే దీనితో చేసిన పరాటా తింటే.. రోజంతా శరీరం అక్టివే..!

Paratha Recipe: ఆకు పచ్చని కూరగాయల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి పోషకాలు, మూలకాలు లభిస్తాయి. అయితే చాలా మంది ఈ కూరగాయాలంటే తినడానికి ఇష్టపడరు. ఎంత తినమని చెప్పన తినడానికి అసక్తి చూపరు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 11, 2022, 09:36 AM IST
  • ఉదయాన్నే సొర కాయ చేసిన పరాటా తింటే..
  • శరీరానికి చాలా ప్రయోజనాలు
  • శరీరాన్ని దృఢంగా చేస్తుంది
Paratha Recipe: ఉదయాన్నే దీనితో చేసిన పరాటా తింటే.. రోజంతా శరీరం అక్టివే..!

Paratha Recipe: ఆకు పచ్చని కూరగాయల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి పోషకాలు, మూలకాలు లభిస్తాయి. అయితే చాలా మంది ఈ కూరగాయాలంటే తినడానికి ఇష్టపడరు. ఎంత తినమని చెప్పన తినడానికి అసక్తి చూపరు. ముఖ్యంగా వేసవి, వానా కాలాల్లో అధికంగా లభించే కూరగాయైన సొర కాయ(Calabash) అంటే అస్సలు ఇష్టపడరు. అయితే దీనిలో చాలా రకాల పోషకాలుంటాయి. ఇందులో ఉండే గుణాలు శరీరానికి శక్తి ఇవ్వడమే కాకుండా.. శరీరాన్ని దృఢంగా చేస్తాయి.  

అయితే తినడానికి ఇష్టపడని వారి కోసం దీనినితో తయారు చేసిన కొత్త రెసిపీని పరిచయం చేయబోతున్నాం. అయితే ఈ  సొర కాయ(Calabash)ను తినడానికి ఇష్టపడని వారు దీనితో తయారు చేసిన పరాటాలు తింటారు. ఎందుకంటే ఇది రుచిని కలిగుంటుంది. కావున తినడానికి ఇష్టపడతారు. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వారు దీనిని తప్పకుండా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది చర్మంపై కూడా ప్రభావవంతంగా పని చేస్తుందని.. దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరాని అనేక రకాల ప్రయోజనాలు లాభిస్తాయాని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

దీని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలు

# సొర కాయ - 1 (తురిమిన)
# పిండి - 2 కప్పులు
# నూనె - కావలసినంత
# ఉప్పు - రుచికి సరిపడ
# ఎర్ర మిరప పొడి - 1 tsp
# కొత్తిమీర పొడి - 1 tsp
# జీలకర్ర - 1 tsp
# పచ్చి కొత్తిమీర తరిగిన - 2 tsp
# ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినవి)

సొరకాయ పరాటా తయారు చేసే విధానం:

1. ఈ పరాటాను చేయడానికి.. ముందుగా సొరకాయ తురుముకుని తీసుకోవాలి.
2. తర్వాత పిండి తురుమిన సొరకాయ, సన్నగా తరిగిన ఉల్లిపాయలను ఒక పాత్రలో తీసుకోండి.
3. ఇందులో ఉప్పు, 1 టీస్పూన్ నూనెను వేయండి.
4. ఇందులోనే కారం, ధనియాల పొడి, జీలకర్ర, ఎర్ర కారం వేసి కలపాలి.
5. ఆతర్వాత కొంత నీరు, నూనె వేసి పిండితో కలపాలి.
6. అయితే ఈ మిశ్రమాన్ని చిన్న పరాటాల్లా చేసుకోవాలి
7. నాన్ స్టిలక్‌ పెనంపై నూనె వేసి ఈ పరాటాను కాల్చండి.
8. దీని తర్వాత పరాటా బంగారు రంగు వచ్చేవరకు పేనంపై ఉంచాలి.
9. దీని తర్వాత పరాటాను బయటకు తీయండి.
10. ప్లేట్‌లో సర్వ్ చేసి ఉదయం అల్పాహారంలో తీసుకోండి.

Read also: CM KCR: డేట్ చెప్పండి.. అసెంబ్లీ రద్దు చేస్తా.. ఎన్నికల్లో తేల్చుకుందాం! విపక్షాలకు సీఎం కేసీఆర్ సవాల్..

Read also: Heavy Rains: కుండపోత వానలతో తెలంగాణ అతలాకుతలం.. గోదావరిలో ప్రమాదకరంగా నీటిమట్టం

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News