Side Effects of Sugar: చక్కర ఎక్కువ తింటే మరీ అంత ప్రమాదమా ?

Side Effects of Sugar: మోతాదుకు మించి ఏది తిన్నా అది ఆరోగ్యానికి హానీ చేస్తుంది అనే విషయం తెలిసిందే. చక్కర వినియోగం విషయంలోనూ అదే వర్తిస్తుంది. చక్కర వినియోగం ఒక పరిమితిలో ఉన్నంత వరకు పర్వాలేదు కానీ పరిమితులు లేకుండా ఎక్కువ చక్కెర వినియోగిస్తే.. అది మీ శరీరానికి హాని తలపెడుతుంది అనే విషయం మర్చిపోవద్దు. 

Written by - Pavan | Last Updated : Jun 11, 2023, 07:33 PM IST
Side Effects of Sugar: చక్కర ఎక్కువ తింటే మరీ అంత ప్రమాదమా ?

Side Effects Of Sugar Free​: తినేటప్పుడు తియ్యగా, రుచికరంగా ఉంది కదా అని ఎక్కువ పంచదార తిన్నారనుకోండి.. అది మీ ఆరోగ్యానికి హాని చేస్తుంది. ముఖ్యంగా అధిక మోతాదులో తీసుకున్న పంచదార వల్ల శరీరంలో  కొవ్వు తయారై అది శరీరంలో పేరుకుపోతుంది. ఫలితంగా అధిక బరువు పెరిగేందుకు కారణం అవుతుంది. అది కాస్తా మధుమేహం, ఊబకాయానికి దారితీస్తుంది. అంతేకాదు.. అధిక మొత్తంలో చక్కర తింటే మీ శరీరంలో జరిగే మార్పులు ఏంటి ? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా చక్కెరలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటాయి. గ్లూకోజ్‌ని మన శరీరంలోని ప్రతి కణం వినియోగించుకుంటుంది కానీ ఫ్రక్టోజ్ విషయంలో అలా కాదు. ఫ్రక్టోజ్ కాలేయంలో మాత్రమే మెటాబలైజ్ అవుతుంది అని బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్, జనరల్ జిఐ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ చెప్పుకొచ్చారు. కాలేయంలోకి చేరుకున్న అదనపు ఫ్రక్టోజ్ కొవ్వుగా మారుతుంది. అదే కానీ జరిగితే ఆ తరువాత కాలేయ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది అని డా ప్రవీణ్ తెలిపారు. క్రమక్రమంగా అది హైపర్ ట్రైగ్లిజరిడెమియాగా మారుతుంది. అయ్యో ఇప్పటికే ఎక్కువ మోతాదులో చక్కర వినియోగించే అలవాటు ఉంది కదా.. మరి మా ఆరోగ్యం పరిస్థితి ఏంటి అని ఆందోళన చెందుతున్నారా ? దానికి కూడా ఒక పరిష్కారం ఉంది. లిపిడ్ ప్రొఫైల్ రక్త పరీక్షతో ఆ వ్యాధిని నిర్ధారించుకోవచ్చు.

వాస్తవానికి ఫైబర్ పుష్కలంగా ఉండే కూరగాయలు లేదా పండ్లు లేదా తృణధాన్యాలు ఆహారంగా తీసుకున్నప్పుడు మెదడులోని సంతృప్త కేంద్రం ఉత్తేజితం అవుతుంది. ఈ కారణంగానే ఎక్కువ ఆహారం తీసుకోవాలి అనే కోరిక కలగకుండా ఉంటుంది. అలాకాకుండా చక్కెర, ఉప్పు, ఫ్యాట్స్ కలిసిన ఆహార పదార్థాలు తిన్నప్పుడు అవి ఆకలిని తీర్చలేవు. అందుకే మరీ మరీ తినాలి అనే కోరిక కూడా కలుగుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారానికి, చక్కెర, ఉప్పు, కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్న వాటికి మధ్ తేడా అదే. 

చక్కెర అధికంగా తినే వారికి ఆ అలవాటు ఉండటానికి శాస్త్రీయంగా ఒక కారణం ఉంది. ఎవరైనా అధిక మోతాదులో చక్కెరను తిన్నప్పుడు.. వారి శరీరంలో జరిగే మార్పు ఏంటంటే.. చక్కెరను ఇష్టపడే బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. క్రమక్రమంగా అది డైస్బియోసిస్ గా మారుతుంది. అంటే మీ ఒంట్లో ఒక రకమైన బ్యాక్టీరియా పెంపొందుతుంది. ఆ బ్యాక్టీరియా చక్కరనే ఆహారంగా తీసుకుంటుంది. అందుకే మీ శరీరం కూడా చక్కెరనే కోరుకుంటుంది. ఈ కారణంగానే చక్కెర ఎక్కువ తినే అలవాటు ఉన్న వారు కూడా మద్యం తరహాలో చక్కెరకు బానిస అవుతుంటారు. అలా అధిక మొత్తంలో తినే చక్కర అనేక రకాలుగా మీ శరీరానికి హాని చేస్తుంది. ఉదాహరణకు, శరీరంలో కొవ్వు పెరగడం, స్తూలకాయం రావడం, మధుమేహం రావడం, దంతాల్లో పుప్పి తయారవడం లాంటి ఎన్నో సమస్యలకు ఇది మూల కారణం అవుతుంది.

Trending News