Sweet corn benefits: స్వీట్‌ కార్న్‌ తింటే 7 మ్యాజికల్‌ బెనిఫిట్స్‌.. తెలిస్తే మీరూ తింటారు..

Sweet corn benefits స్వీట్ కార్న్ లో న్యూట్రన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది తక్షణ శక్తి లభిస్తాయి అంతేకాదు స్వీట్ కార్న్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇందులో మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి

Written by - Renuka Godugu | Last Updated : May 12, 2024, 04:08 PM IST
Sweet corn benefits: స్వీట్‌ కార్న్‌ తింటే 7 మ్యాజికల్‌ బెనిఫిట్స్‌.. తెలిస్తే మీరూ తింటారు..

Sweet corn benefits: స్వీట్ కార్న్ లో న్యూట్రన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది తక్షణ శక్తి లభిస్తాయి అంతేకాదు స్వీట్ కార్న్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇందులో మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి.స్వీట్‌ కార్న్ ఈ కాలంలో అన్ని సీజన్లలలో అందుబాటులో ఉంటుంది. అప్పట్లో కేవలం వర్షాలు పడితేనే స్వీట్‌ కార్న్‌ గుర్తుకు వచ్చేది. వీటిని అందరి ఇళ్లలో కూడా వివిధ వంటల్లో సులభంగా వండుకుంటున్నారు. వీటితో ఛాట్‌ కూడా చేసుకోవచ్చు. లేదా ఉడకబెట్టుకుని, కాల్చుకుని తీసుకోవచ్చు. స్వీట్‌ కార్న్‌ చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడి తింటారు. అయితే, ఈరోజు మనం స్వీట్ కార్న్‌ మన డైట్లో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏముంటాయో తెలుసుకుందాం.

కనిజాలు పుష్కలం..
స్వీట్ కార్న్ లో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఉంటాయి. ఇది శరీర ఆరోగ్యానికి ఎంతో మంచిది.మినరల్స్‌, విటమిన్స్‌ మన శరీరానికి ఎంతో అవసరం. అందుకే ఈజీగా అందుబాటులో ఉండే స్వీట్ కార్న్ మీ డైట్లో చేర్చుకోండి.

డై టరీ ఫైబర్..
స్వీట్ కార్న్ లో కరిగే కరిగని ఫైబర్ ఉంటుంది ఇది జీవన ఆరోగ్యానికి ఎంతో అవశ్యకం మలబద్ధకం సమస్య రాకుండా నివారిస్తుంది. అంతేకాదు స్వీట్ కార్న్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్వీట్ కార్న్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్ గుణాలు..
స్వీట్ కార్న్ లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి ఎంతో అవసరం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే జియాంథీన్, లుటీన్ కంటి సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తాయి.

శక్తి..
స్వీట్‌ కార్న్‌లో కార్బోహైడ్రేట్స్ అధిక మోతాదులో ఉంటుంది. అందుకే ఇది తిన్న వెంటనే శక్తి అందుతుంది ఇది మంచి స్నాక్ ఐటమ్లా  తినవచ్చు.

ఇదీ చదవండి: పియర్ ఫ్రూట్ తింటే దీర్ఘకాలం పాటు జీవిస్తారట..

గ్లూటన్ ఫ్రీ..
సహజంగానే స్వీట్ కార్న్ లో గ్లూటన్ ఫ్రీ ఉంటుంది. ఇది గోధుమపిండి అలర్జీ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్. కార్న్ ఫ్లోర్, కార్న్‌ మిల్‌ గ్లూటన్ ఫ్రీ ఆహారాలు.

ఇదీ చదవండి: ఈ 5 తింటే యూరిక్ యాసిడ్ స్థాయిలు నేచురల్‌గానే తగ్గిపోతాయట.. 

చర్మ ఆరోగ్యం..
స్వీట్ కార్న్ లో విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది చర్మంపై కొల్లజెన్ ఉత్పత్తికి తోడ్పడుతాయి. చర్మం సాగే గుణానికి సహకరిస్తాయి ఇంకా వృద్ధాపచాయలు త్వరగా రావు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News