Weight Loss Tips: జామాకులతో అధిక బరువుకు చెక్, నిజానిజాలేంటి, ప్రయోజనాలేంటి

Weight Loss Tips: ఏడాది పొడుగునా లభించే జాంకాయలు అందరికీ ఇష్టమే. జాంకాయలు ఆరోగ్యపరంగా చాలా అద్బుత ఔషధంలా పనిచేస్తాయి. రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే చాలా సమస్యలు దూరమౌతాయి. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 8, 2023, 01:47 PM IST
Weight Loss Tips: జామాకులతో అధిక బరువుకు చెక్, నిజానిజాలేంటి, ప్రయోజనాలేంటి

Weight Loss Tips: ప్రకృతిలో లభించే దాదాపు అన్ని ఫ్రూట్స్‌లో ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయి. ఇందులో సీజనల్ ఫ్రూట్స్ కొన్ని ఉంటే..ఏడాది పొడుగునా లభించేవి మరికొన్ని ఉన్నాయి. జాంకాయలు ఇందులో ముఖ్యమైనవి. జామ ఆకులు కూడా ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కల్గిస్తాయి.

ప్రకృతిలో లభించే అద్భుతమైన ఫ్రూట్ జాంకాయ. సైంటిఫిక్ పేరు Psidium Guajava.ఇండియాలో ముఖ్యంగా దక్షిణాదిన విస్తృతంగా లబించే జాంకాయ వాస్తవానికి అమెరికా, దక్షిణ అమెరికా, కరేబియన్, మెక్సికో దేశాలకు చెందింది. లోపలి భాగం తెల్లగా గుజ్జుగా ఉంటుంది. జామాకులు పచ్చగా మెరుస్తుంటాయి. ఇందులో పోషక పదార్దాలు చాలా అధికం. యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉండే జాంకాయ చాలా వ్యాధుల్ని దూరం చేస్తుంది. అనాదిగా అద్బుతమైన ఔషధంలా పనిచేస్తోంది. జామాకులైతే పంటి వ్యాధులకు, బరువు తగ్గించేందుకు ఉపయోగపడతాయి. గొంతు గరగర వంటి సమస్యలకు కూడా ఉపశమనం కల్గిస్తాయి.

జామాకులతో బరువు తగ్గడం ఎలా

జామాకులు బరువు తగ్గించే ప్రక్రియలో కీలకంగా ఉపయోగపడతాయి. చాలామంది అనాదిగా బరువు తగ్గించేందుకు లేత జామాకుల్ని నమిలి తినడం లేదా లేత జామాకుల్ని టీలో వేసి తాగడం చేస్తుంటారు. అయితే దీనికి శాస్త్రీయంగా ఆధారముందా లేదా..

జామాకులు టీ లేదా జామాకులు తినడం వల్ల బరువు తగ్గుతుందనే విషయంలో ఏ విధమైన శాస్త్రీయ పరిశోధన జరగలేదు. అయితే ఎలుకలపై చేసిన కొన్ని పరిశోధనల ద్వారా జామాకులు బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తున్నాయని తేలింది. 

జామాకులు కైటోచిన్, కెర్సోటిన్, గ్యాలిక్ యాసిడ్ సహా యాంటీ ఆక్సిడెంట్లు..బరువు తగ్గేందుకు అద్బుతంగా ఉపయోగపడుతున్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. శాస్త్రీయమైన ఆదారాలు లేకపోయినా అనాదిగా జామాకుల్ని బరువు తగ్గించడంలో కీలకంగా ఉపయోగిస్తున్నారు.

జామాకులతో హెర్బల్ టీ

జామాకులు బరువు తగ్గేందుకు దోహదపడుతున్నాయని అనాదిగా చాలామంది చెబుతున్నా..ఆచరిస్తున్నా శాస్త్రీయ ఆధారాలు మాత్రం లేవు. అయితే జామాకులతో సాదారణ టీ కాకుండా హెర్బల్ టీ తాగితే మంచి ఫలితాలు కన్పిస్తాయి. అంటే పంచదార లేని టీలో జామాకులు ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలుంటాయి.

Also read: Vitamin D Benefits: విటమిన్ డి సూర్య రశ్మిలోనే కాదు..ఈ 4 పదార్ధాలు తీసుకుంటే చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News