Jharkhand Boat Accident: జార్ఖండ్‌లో విషాదం...నదిలో పడవ బోల్తా.. 14 మంది మృతి

boat accident: జార్ఖండ్‌ బోటు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 14కి చేరింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు సీఎం హేమంత్ సోరెన్.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2022, 01:45 PM IST
  • బరాకర్ నదిలో పడవ బోల్తా
  • 14 మంది దుర్మరణం
  • జార్ఖండ్‌ జమ్తారా జిల్లాలో ఘటన
Jharkhand Boat Accident: జార్ఖండ్‌లో విషాదం...నదిలో పడవ బోల్తా.. 14 మంది మృతి

Jharkhand boat tragedy: జార్ఖండ్‌లోని జమ్తారా జిల్లాలో (Jamtara district) బరాకర్ నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో మృతదేహాల సంఖ్య 14కి చేరింది. నిన్న ఎనిమిది మృతదేహాలు వెలికితీసిన ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు..ఇవాళ మరో ఆరు మృతదేహాలు కనుగొన్నారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మహిళలు ఉన్నారని జమ్తారా డిప్యూటీ కమిషనర్ ఫైజ్ అహ్మద్ ముంతాజ్ తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (CM Hemant Soren) ప్రకటించారు.

ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలు ఐదురోజుల పాటు ఈ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. మృతదేహాలను పోస్టుమార్టం చేసిన తర్వాత వారి బంధువులకు అప్పగించారు. ఫిబ్రవరి 24న నిర్సాలోని బెర్బెడియా నుంచి జమ్తారాలోని బెరిగావ్‌కు వెళ్తుండగా బోటు బోల్తా పడింది. బలమైన ఈదురు గాలులు, వర్షం, తుపాను ఈ ప్రమాదానికి కారణాలుగా తెలుస్తోంది. ఈ పడవలో ఉన్నవారంతా చిరువ్యాపారులుగా సమాచారం. 

నదిపై బార్బెండియా బ్రిడ్జి (Barbendia bridge) పనిచేస్తే ప్రమాదాన్ని నివారించవచ్చని పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. వంతెన మరమ్మతు పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు నది దాటేందుకు నీటి మార్గంలో వెళ్తున్నారని వారు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే కోరినట్లుగా నదిపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం త్వరలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోందని సోరెన్ చెప్పారు.

Also read: Satya Nadella: మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల కుమారుడు కన్నుమూత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News