Jharkhand: సీఎం ఇంట్లో కరోనా కలకలం.. భార్య, పిల్లలు సహా 15 మందికి పాజిటివ్..

Jharkhand CM Hemant Soren’:  దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలట్లేదు. తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2022, 12:31 PM IST
Jharkhand: సీఎం ఇంట్లో కరోనా కలకలం.. భార్య, పిల్లలు సహా 15 మందికి పాజిటివ్..

Jharkhand CM Hemant Soren's house: జార్ఖండ్ సీఎం ఇంట్లో కరోనా కలకలం రేగింది. ఆయన భార్యతోపాటు ఇద్దరు పిల్లలు సహా మొత్తం 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే.. పరీక్షల్లో ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌కు (Jharkhand CM Hemant Soren) నెగిటివ్‌గా తేలినట్లు అధికారులు వెల్లడించారు. 

సీఎం నివాసంలో ఇప్పటివరకు 62 మందికి కోవిడ్ -19 (Covid-19) పరీక్షలు చేసినట్లు రాంచీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ తెలిపారు. వారిలో 24 మంది రిపోర్టులు శనివారం సాయంత్రం వచ్చాయి. అందులో  సీఎం భార్య కల్పనా సోరెన్ (Kalpana Soren), వారి ఇద్దరు కుమారులు నితిన్, విశ్వజిత్, కోడలు సరళా ముర్ము సహా15 మందికి పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. వారందరికీ స్వల్ప లక్షణాలు ఉండటంతో..ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంచారు. 

Also Read: Covid 19: 'సునామీ'లా విరుచుకుపడుతోన్న కరోనా.. వరుసగా మూడో రోజు లక్ష దాటిన కేసులు

మరోవైపు జార్ఖండ్ ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా సైతం కరోనా (Coronavirus) బారిన పడ్డారు. శనివారం పరీక్షలు చేయించుకోగా.. కోవిడ్ -19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన జంషెడ్‌పూర్‌లోని తన నివాసంలో ఐసోలేట్ అయ్యారు. ఇటీవల తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కాగా అంతకుముందు కూడా ఆరోగ్యమంత్రి కరోనా సోకింది. జార్ఖండ్ లో ప్రస్తుతం 21,098 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News