Minor Girl Gang Rape : బస్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. బీహార్ లో మరో నిర్భయ ఘటన..

Bihar Gang Rape : దేశంలో మహిళలకు రక్షణే లేకుండా పోతోంది. నిర్భయ లాంటి కఠిన చట్టాలు ఉన్నాఅఘాయిత్యాలు ఆగడం లేదు. ఆడపిల్లలు కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నాయి కామాంధులు. దేశంలో రోజూ ఏదో ఒక చోట దారుణం జరుగుతూనే ఉంది.

Written by - Srisailam | Last Updated : Jun 9, 2022, 08:18 AM IST
  • బీహార్ లో మరో నిర్భయ ఘటన
  • బస్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్
  • నలుగురు నిందితులు అరెస్ట్
Minor Girl Gang Rape : బస్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. బీహార్ లో మరో నిర్భయ ఘటన..

Bihar Gang Rape: దేశంలో మహిళలకు రక్షణే లేకుండా పోతోంది. నిర్భయ లాంటి కఠిన చట్టాలు ఉన్నాఅఘాయిత్యాలు ఆగడం లేదు. ఆడపిల్లలు కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నాయి కామాంధులు. దేశంలో రోజూ ఏదో ఒక చోట దారుణం జరుగుతూనే ఉంది. ఇటీవలే హైదరాబాద్ లో వెలుగుచూసిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైంది. స్నేహితులతో కలిసి పబ్ కు వచ్చిన బాలికను ట్రాప్ చేసి.. కారులోనే ఐదుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితులంతా ప్రజాప్రతినిధుల పిల్లలే కావడం తెలంగాణలో ప్రకంపనలు రేపింది. హైదరాబాద్ గ్యాంగ్ రేప్ ఘటన మరవకముందే.. బీహార్ లో మరో దారుణం జరిగింది.  

బీహార్‌ రాష్ట్రంలోని ఈస్ట్ చంపారన్ జిల్లాలో నిర్భయ తరహా ఘటన వెలుగుచూసింది. 17 ఏళ్ల మైనర్ బాలికపై కదులుతున్న బస్సులోనే గ్యాంగ్ రేప్ చేశారు దుండగులు.
బీహార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈస్ట్‌ చంపారన్‌ జిల్లాలోని మోతిహరి బస్టాండ్‌లో మైనర్ బాలిక బస్ కోసం ఎదురుచూస్తు నిలబడింది. బెట్టయకు బస్ లో వెళ్లడానికి ఆమె అక్కడికి వచ్చింది. బస్తాండ్ దగ్గకు బస్ రాగానే.. ఆ బాలిక ఎక్కేసింది. డ్రైవర్ కూడా బెట్టయ్య ప్రాంతానికి వెళ్తున్నామని చెప్పడంతో లోపలికి వెళ్లి కూర్చుంది. అయితే కాసేపటికి మైనర్ బాలికకు మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చాడు డ్రైవర్. దీంతో ఆమె సృహతప్పి పడిపోయింది. అచేతనంగా పడిఉన్న బాలికపై బస్ డ్రైవర్ తో పాటు కండక్టర్ అఘాయిత్యానికి తెగబడ్డారు. కదులుతున్న బస్సులోనే రేప్ చేశారు. బస్సులో ఉన్న మరో ఇద్దరు కూడా బాలికపై అత్యాచారం చేశారు. అనంతరం బాధితారాలిని బస్సులో ఉంచి.. బయటికి రాకుండా డోర్లు వేసి నిందుతులు వెళ్లిపోయారు.

కాసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన మైనర్ బాలిక.. బస్సు నుంచి బయటికి రావడానికి ప్రయత్నించింది. డోర్లు వేసి ఉండటంతో కేకలు వేసింది. బాలికను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి వ్చచిన పోలీసులు.. బాలికను బెట్టియా హాస్పిటల్ కు తరలించారు. వైద్య పరీక్షల్లో బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిందిని తేలింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బస్ ను సీజ్ చేశారు. బాలిక చెప్పిన వివరాలతో విచారణ జరిపి.. నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. బస్‌ డ్రైవర్‌, కండక్టర్‌ తో పాటు  హెల్పర్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై పోక్సో తోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు బెట్టియా పోలీసు అధికారి ముకుల్ పాండే తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన గ్యాంగ్ రేప్ ఘటన బీహార్‌లో కలకలం రేపుతోంది.

READ ALSO: TSRTC Hikes Diesel Cess: భారీగా డీజిల్ సెస్ పెంపుతో ప్రయాణికులకు మళ్లీ షాక్ ఇచ్చిన టిఎస్ఆర్టీసీ

READ ALSO: Shama Sikander Bikini Pics: బికినీలో రెచ్చిపోయిన షామా సికిందర్.. మొత్తం చూపించేస్తుందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News