నేటి నుంచే సేల్: డిస్కౌంట్ల పోటీకి సిద్ధమైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు మరోసారి డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాయి.

Last Updated : Jul 16, 2018, 01:41 PM IST
నేటి నుంచే సేల్: డిస్కౌంట్ల పోటీకి సిద్ధమైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు మరోసారి డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాయి. 'ప్రైమ్ డే' పేరుతో అమెజాన్ 36 గంటల డిస్కౌంట్ సేల్‌ను నిర్వహిస్తోంది. మొబైల్స్, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్ పరికరాలపై 40-50 శాతం డిస్కౌంట్లతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై 10 శాతం డిస్కౌంట్‌ను అందజేస్తోంది. అటు ఫ్లిప్‌కార్ట్  బిగ్ షాపింగ్ డేస్ పేరుతో 3 రోజుల సేల్‌ను ఈ రోజు నుంచి ప్రారంభిస్తోంది.

మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యే అమెజాన్‌ 'ప్రైమ్ డే' సేల్‌లో.. వన్‌ప్లస్‌, హెచ్‌పీ, ఏసర్‌ వంటి టాప్‌ బ్రాండ్‌ల ప్రొడక్ట్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా లాంచ్‌ చేయబోతున్నాయి. ప్రైమ్‌ మెంబర్లు క్విజ్‌లో పాల్గొని వన్‌ప్లస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ను గెలుచుకునే అవకాశం పొందవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 8, మోటో జీ6 వంటి వాటిపై ఎక్స్చేంజ్‌ ఆఫర్లు, హానర్‌ 7ఎక్స్‌ ఫోన్‌పై 3వేల రూపాయల వరకు తగ్గింపు ధర, నోట్‌8పై రూ.10 వేల తగ్గింపు ధరను అమెజాన్‌ ఆఫర్‌ చేస్తోంది. హానర్‌ 7సీ, శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌7 ప్రైమ్‌, హువావే పీ20 ప్రొ, లైట్‌, వివో వీ7ప్లస్‌, వివో వీ9 స్మార్ట్‌ఫోన్లపై కూడా ఆఫర్ ఉంది. పవర్‌ బ్యాంక్స్‌, స్క్రీన్‌ ప్రొటెక్టర్స్‌, కేసెస్‌ అండ్‌ కవర్స్‌, డేటా కేబుల్స్‌ వంటి వాటిపై 80 శాతం డిస్కౌంట్‌ను అమెజాన్‌ ప్రకటించింది. అలానే పాత ఫోన్ల ఎక్స్చేంజ్‌పై రూ.3000 ఆఫర్ ఇస్తున్నట్లు అమెజాన్ తెలిపింది.

బిగ్ షాపింగ్ డేస్ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ కార్డుపై 10 శాతం డిస్కౌంట్‌ను అందజేస్తోంది. అలానే పాత ఫోన్లపై ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ను, బైబ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. టీవీ, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై 70 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. వివో V7+64GB వేరియంట్‌ను రూ.19,990కు(అసలు ధర రూ. 21,990), ఆనర్ 9i స్మార్ట్‌ఫోన్‌ను రూ.14,999కు ఆఫర్ చేస్తోంది.

Trending News