తెలుగు ముద్దు అంటూనే ..ఇంగ్లీష్‌లో మాట్లాడిన మంత్రి

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తెలుగుకు ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ అనేక ఇంగ్లీష్ పదాలు వాడిన మంత్రి అఖిలప్రియ.

Last Updated : Nov 29, 2017, 04:47 PM IST
తెలుగు ముద్దు అంటూనే ..ఇంగ్లీష్‌లో మాట్లాడిన మంత్రి

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తెలుగు భాషాభివృద్ధిపై మంత్రి అఖిలప్రియ సభలో మాట్లాడుతూ అన్ని శాఖలు తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతున్న సందర్భంలో అనేక ఇంగ్లీష్ పదాలు దొర్లాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శ్యాం సుందర్ కల్పించుకుని అఖిలప్రియకు చురుకలంటిచారు. తెలుగు బాషకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి .. అనేక పదాలు ఇంగ్లీష్ పదాలు వాడుతున్నారని పేర్కొన్నారు. మంత్రులందరూ ఇక నుంచి ఇంగ్లీష్ పదాలు వాడకుండా ..తెలుగులోనే మాట్లాడితే బాగుంటుందని..అప్పుడే ఇతరుకు మనం ఆదర్శప్రాయంగా ఉంటామని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే రియాక్షన్ తో మంత్రి అఖిలప్రియ షాక్ తిన్నారు.

Trending News