Bank of Baroda Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకై ఎదురుచూస్తున్నవారికి తిరుగులేని అవకాశం. లక్షకు పైగా జీతంతో అటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇటు బ్యాంక్ ఆఫ్ బరోడాలు ఉద్యోగాలు భర్తీ చేయనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి రెండు బ్యాంకులు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగ నోటిఫికేషన్ గురించి చర్చిద్దాం.
బ్యాంక్ ఆప్ బరోడాలో 2025 సంవత్సరానికి సంబంధించి ప్రొబెషనల్ పోస్టులు బర్తీకి నోటిఫికే,న్ విడుదలైంది. మొత్తం 1267 ఖాళీల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రొబిషనరీ పోస్టుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్, మేనేజర్-స్కిల్స్, మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్, సీనియర్ మేనేజర్-ఎంఎస్ఎంఈ రిలేష,న్ షిప్, సీనియర్ డెవలపర్, డెవలపర్, క్లౌడ్ ఇంజనీర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఫెసిలిటీ మేనేజర్, కార్పొరేట్ అండ్ ఇనిస్టిట్యూషనల్ క్రెడిట్ , ఫైనాన్స్ ఎంటర్‌ప్రైజెస్ ఉద్యోగాలున్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ జనవరి 17 కాగా డిసెంబర్ 28 అంటే ఇవాళ్టి నుంచి అప్లికేషన్లు ఆన్‌లైన్ విధానంలో స్వీకరిస్తున్నారు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగరీ అభ్యర్ధులకు పరీక్ష ఫీజు 600 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలకు మాత్రం కేవలం 100 రూపాయలు ఫీజు ఉంది. ఈ పోస్టులకు విద్యార్హతలు ఉద్యోగాన్ని బట్టి మారుతుంటాయి. సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుండాలి. కొన్ని పోస్టులకైతే బీటెక్, ఎంబీఏ, సీఏ, సీఎఫ్ఏ కోర్సులు చేసుండాలి. ఇక కనీస వయస్సు 25 ఏళ్లు కాగా గరిష్టంగా 40 ఏళ్లుండవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగ నియామకాలు ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆదారంగా ఉటాయి. ఇక అన్నింటికంటే ముఖ్యం జీతభత్యాలు. ఈ ఉద్యోగాలకు జీతం 48,480 రూపాయల నుంచి 1,35,020 రూపాయలుంటుంది. వీటితో పాటు హెల్త్ ఇన్సూరెన్స్, లీవ్స్, పెన్షన్, ప్రోవిడెంట్ ఫండ్ ప్రయోజనాలు కలుగుతాయి.
Also read: Bank Holidays: జనవరిలో 15 రోజులు బ్యాంకులకు సెలవులు, ఎప్పుడెప్పుడు ఎక్కడ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.