Coronavirus updates:కరోనావైరస్ ఆందోళనల మధ్య బ్యాంకులకు ఆర్బీఐ సూచన

కరోనావైరస్ విజృంభిస్తున్న (Coronavirus outbreak) నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పాఠశాలలు, కాలేజీలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ మూసేసిన సంగతి తెలిసిందే. మార్చి 31 వరకు ఈ ఆదేశాలను పాటించాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చిచెప్పాయి. 

Last Updated : Mar 16, 2020, 06:13 PM IST
Coronavirus updates:కరోనావైరస్ ఆందోళనల మధ్య బ్యాంకులకు ఆర్బీఐ సూచన

న్యూ ఢిల్లీ : కరోనావైరస్ విజృంభిస్తున్న (Coronavirus outbreak) నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పాఠశాలలు, కాలేజీలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ మూసేసిన సంగతి తెలిసిందే. మార్చి 31 వరకు ఈ ఆదేశాలను పాటించాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చిచెప్పాయి. పెళ్లిళ్లు, పేరంటాలు కూడా వాయిదా వేసుకోవాల్సిందిగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజానికానికి విజ్ఞప్తి చేశాయి. అంతేకాదు.. ఢిల్లీ పరిధిలో 50 మందికి మించి ఎక్కడా, ఎవ్వరూ సమూహంగా ఏర్పడకూడదని ఢిల్లీ సర్కార్ (Delhi govt) స్పష్టంచేసింది. దీంతో స్కూల్స్, కాలేజీలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ తరహాలోనే బ్యాంకులకు కూడా సెలవులు (Bank holidays) ఇస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దీనిపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది. 

ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) సైతం దీనిపై స్పందించారు. బ్యాంకుల సేవలపై కరోనావైరస్ ప్రభావం పడకుండా జాగ్రత్త వహించాలని ఆర్బీఐ గవర్నర్ సూచించారు. బ్యాంకులపై కరోనావైరస్ ప్రభావం పడితే.. దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతుందని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు మీడియాతో మాట్లాడుతూ శక్తికాంత దాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News