Basavaraj Bommai takes oath: బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం పూర్తి

Basavaraj Bommai takes oath at Raj Bhavan: బసవరాజ్ బొమ్మై కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా కొద్దిసేపటి క్రితమే ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని కర్ణాటక రాజ్ భవన్‌లో బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారోత్సవం (Basavaraj Bommai's oath taking ceremony) జరిగింది. మంగళవారం సాయంత్రం జరిగిన బీజేపి లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు బసవరాజ్ బొమ్మైని తమ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 28, 2021, 01:03 PM IST
Basavaraj Bommai takes oath: బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం పూర్తి

Basavaraj Bommai takes oath at Raj Bhavan: బసవరాజ్ బొమ్మై కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా కొద్దిసేపటి క్రితమే ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని కర్ణాటక రాజ్ భవన్‌లో బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. మంగళవారం సాయంత్రం జరిగిన బీజేపి లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు బసవరాజ్ బొమ్మైని తమ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. దీంతో బిఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన అనంతరం ఆయన స్థానంలో బసవరాజ్ కర్ణాటకకు 23వ ముఖ్యమంత్రి అయ్యారు.  

యడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి చేసుకున్న రోజే ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన సూచించిన బసవరాజ్ బొమ్మైకే బీజేపి నేతలు పట్టం కట్టడం విశేషం. బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) కూడా లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన నేతే కావడంతో ఆయన ఎన్నిక సులువైంది. 

Also read : Basavaraj Bommai: కర్ణాటకకు కొత్త సీఎం బసవరాజ్ బొమ్మై

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి రేసులో మొదట అనేక పేర్లు వినిపించాయి. ఉత్తర కర్ణాటకలోని ధర్వాడ్ జిల్లా నుంచి అర్వింద్ బెల్లాడ్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే, అంతిమంగా బీజేపి అధిష్టానం మాత్రం యడియూరప్ప (BS Yediyurappa) సూచించిన బసవరాజ్ బొమ్మైకే ఓటేసింది. 

కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ పరిశీలన కోసం బీజేపీ అధిష్టానం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి (Kishan Reddy), ధర్మేంద్ర ప్రధాన్‌ని పరిశీలకులుగా పంపించిన సంగతి తెలిసిందే.

Also read : Pegasus Spyware: పెగసస్ స్పైవేర్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన జర్నలిస్టులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News