భోపాల్ గ్యాంగ్ రేప్ కేసు: నలుగురికి జీవితఖైదు

అక్టోబరు 31, 2017 తేదీన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని హబీబ్ గంజ్ రైల్వేస్టేషన్ ఏరియాలో మూడు గంటల పాటు 19 ఏళ్ల అమ్మాయిని దారుణంగా రేప్ చేసిన నిందితులకు ఎట్టకేలకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు శిక్ష విధించింది. ఈ ఘటనకు బాధ్యులైన నలుగురికి జీవితఖైదు విధించింది. 

Last Updated : Dec 23, 2017, 03:15 PM IST
భోపాల్ గ్యాంగ్ రేప్ కేసు: నలుగురికి జీవితఖైదు

అక్టోబరు 31, 2017 తేదీన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని హబీబ్ గంజ్ రైల్వేస్టేషన్ ఏరియాలో మూడు గంటల పాటు 19 ఏళ్ల అమ్మాయిని దారుణంగా రేప్ చేసిన నిందితులకు ఎట్టకేలకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు శిక్ష విధించింది. ఈ ఘటనకు బాధ్యులైన నలుగురికి జీవితఖైదు విధించింది. ఆర్పీఎఫ్ పోలీసు కుమార్తె అయిన ఆ అమ్మాయి కోచింగ్ క్లాసుకు వెళ్లి తిరిగొస్తున్న క్రమంలో ఆమెపై ఈ అత్యాచార ఘటన జరిగింది. ఆ ఘటన తర్వాత బాధితురాలికి సంబంధించిన మొబైల్ ఫోన్‌తో పాటు నగలను కూడా నేరస్థులు తస్కరించారు.  అయితే ఘటన జరిగాక పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఆ అమ్మాయి కంప్లైంట్‌ను రిజిస్టర్ చేయడానికి స్థానిక పోలీసులు తిరస్కరించారు. ఆ ఘటనను ఒక సినిమా కథగా కొట్టిపారేశారు. 

సోషల్ మీడియాతో పాటు పలు పత్రికల ద్వారా ఈ కథనం బహిర్గతమయ్యాక, ఎట్టకేలకు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశానుశారం 15 రోజులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. సెక్షన్ 376 (2) ఎన్ ప్రకారం గ్యాంగ్ రేప్ చేయడం, హత్య చేయడానికి ప్రయత్నించడం, కిడ్నాప్ చేయడం మరియు గాయపరచడం వంటి అభియోగాలపై కేసును నమోదు చేశారు. కోర్టు తొలుత పోలీసుల వైఖరిని తప్పుపట్టి, అందుకు కారణమైన అయిదుగురు పోలీసులను సస్పెండ్ చేయమని ఆదేశించింది. ఇటీవలే హియరింగ్‌కు వచ్చిన ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట, నిందితులకు జీవితఖైదు విధించింది

Trending News