కురుచటి దుస్తులు ధరించడం లేదని, మద్యం సేవించడం లేదని త్రిపుల్ తలాక్

కురుచటి దుస్తులు ధరించడం లేదని, మద్యం సేవించడం లేదని త్రిపుల్ తలాక్ చెప్పిన భర్త

Last Updated : Oct 14, 2019, 12:10 PM IST
కురుచటి దుస్తులు ధరించడం లేదని, మద్యం సేవించడం లేదని త్రిపుల్ తలాక్

న్యూఢిల్లి: ఇంట్లో భార్య పద్దతిగా, సంప్రదాయబద్దంగా నడుచుకోవడం లేదనే కారణంతోనే భార్యకు విడాకులు ఇచ్చిన కేసులనే ఇప్పటి వరకు చూశాం కానీ బీహార్‌కు చెందిన ఒక ముస్లిం మహిళకు మాత్రం అందుకు విరుద్ధమైన అనుభవం ఎదురైంది. నువ్వు కురుచటి దుస్తులు ధరించడం లేదు, మద్యం సేవించడం లేదు అనే కారణాలను సాకుగా చూపిస్తూ ఆమెకు త్రిపుల్ తలాక్ చెప్పాడు ఆమె భర్త. విలాసంగా కనిపించే దుస్తులు ధరించడం లేదని, మద్యం సేవించడం లేదని తన భర్త తనకు త్రిపుల్‌ తలాఖ్‌ చెప్పి విడాకులు ఇచ్చారని నూరి ఫాతిమా అనే మహిళ రాష్ట్ర మహిళా కమిషన్‌ని ఆశ్రయించింది. 

వివరాల్లోకి వెళ్తే.. ఇమ్రాన్‌ ముస్తాఫా అనే వ్యక్తితో 2015లో నూరి ఫాతిమాకు వివాహమైంది. ఆ తర్వాత వారి కుటుంబం ఢిల్లికి మకాం మార్చింది. అప్పటి నుంచి ఆధునిక యువతుల్లాగా తనను కురుచ దుస్తులు ధరించాలని, రాత్రి పార్టీలకు హాజరై మద్యం సేవించాలని వేధించేవాడని... అందుకు తాను అంగీకరించనందుకు రోజూ తనను కొట్టేవాడని కమిషన్‌కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారామె. కొద్దిరోజుల కిందట తనను ఇంట్లోంచి వెళ్లిపోవాలన్నాడని, తాను వెళ్లనని చెప్పినందుకు అక్కడికక్కడ త్రిపుల్‌ తలాఖ్‌ చెప్పి విడాకులు ఇచ్చాడని ఫిర్యాదు చేశారామె. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె భర్తకు నోటీసు జారీ చేసిన రాష్ట్ర మహిళా కమిషన్‌.. అతడి నుంచి వివరణ కోరింది.

Trending News