కరియప్పకు భారతరత్న ఇవ్వాల్సిందే

  

Last Updated : Nov 4, 2017, 06:56 PM IST
కరియప్పకు భారతరత్న ఇవ్వాల్సిందే

ఈ రోజు భారత సైనికదళం ప్రధాన అధికారి బిపిన్ రావత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఫీల్డ్ మార్షల్ స్వర్గీయ కేఎం కరియప్పకు ప్రభుత్వం భారతరత్న ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. కర్ణాటకలోని కొడగు జిల్లాలో జనరల్ కరియప్ప, పద్మభూషణ్ జనరల్ కె.సుబ్బయ్య తిమ్మయ్య విగ్రహాలను ఆవిష్కరించడానికి వచ్చిన రావత్ మాట్లాడుతూ, కరియప్పను తలచుకొన్నారు. 1947లో భారత్ పాక్ యుద్ధ సమయంలో ఎనలేని సాహసంతో పోరాడిన కరియప్ప సైనికదళంలో అత్యున్నత పదవైన 5 స్టార్ ర్యాంకును పొందిన ఫీల్డ్ మార్షల్ అని, 1949లో కమాండర్ ఇన్ ఛీఫ్‌గా ఎంపికయ్యారని తెలియజేశారు. అటువంటి వీరులను గుర్తుపెట్టుకొని. ప్రభుత్వం పురస్కారాలు అందించి సత్కరించాల్సిన ఆవశ్యకత ఉందని, ప్రభుత్వం ఆయనకు భారతరత్నను అందించాల్సిందిగా కోరుతున్నామని ఈ సందర్భంగా రావత్  తెలిపారు. కెఎం కరియప్ప కుమారుడైన కేసీ కరియప్ప కూడా ఎయిర్ మార్షల్‌‌గా పనిచేశారు. 1965లో భారత్ - పాక్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి.. అనుకోని ఘటనలో శత్రుసేనలకు చిక్కారు. 

Trending News